Tripathi : –ప్రజా దీవెన, నల్లగొండ: ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దర ఖాస్తులను త్వరితగతిన పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి ఆదేశించారు. బుధవారం ఆమె మాడుగులపల్లి తహసిల్దార్ కార్యా లయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు.
పోర్టల్ లో ఉన్న దరఖాస్తులు, రెవెన్యూ ,భూములకు సంబంధిం చిన మాన్యువల్ ఫైళ్ల ను ఆమె తనిఖీ చేశారు, ధరణి పోర్టల్ లో వివిధ మాడ్యూల్స్ లో ఉన్న దర ఖాస్తులన్నింటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆమె తహసీల్దార్ ను ఆదేశించారు. ఇప్ప టివరకు ధరణి ద్వారా పరిష్క రిం చిన దరఖాస్తులు, ఫైళ్లను ఆమె పరిశీలించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మా డుగుల పల్లి తహసిల్దార్ ఉన్నారు.