Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi : పీహెచ్సీ పనితీరు బాగుంది

–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Tripathi : ప్రజా దీవెన, కేతేపల్లి: కేతేపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, కేతేపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

డాక్టర్లు, వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.సిబ్బంది అందరూ సకాలంలో ఆసుపత్రికి రావాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఆస్పత్రి ద్వారా నిర్వహిస్తున్న వైద్య సేవలపై ఆమె ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్చనతో ఆరా తీశారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలతో పాటు, సాధారణ డెలివరీలు, మాతా, శిశు సంరక్షణ తదితర అన్ని అంశాల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ బాగా పనిచేస్తుండటం పట్ల ఆసుపత్రి వైద్యులు ,సిబ్బందిని అభినందించారు. కేతపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి అవసరమైన లేబర్ రూమ్ ను మరింత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చే రహదారి వెంట లైట్లు ఏర్పాటు చేసేందుకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ప్రసవాలకు సంబంధించి ఈ డి డి రిజిస్టర్ ను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.

 

 

హై రిస్క్ కేసులు, కవలలు ,ఇతర రిస్క్ ఎక్కువగా ఉన్న కేసులను మాత్రమే ఏరియా ఆసుపత్రులు, నల్గొండ జిల్లా ఆస్పత్రికి పంపించాలని, తక్కిన వాటికి ఇక్కడే వైద్యం చేసే విధంగా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండేలా అలాగే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుట్టేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, వారు ఆకుకూరలు, బెల్లం తదితరాలు తీసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆమె డాక్టర్లకు సలహా ఇచ్చారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, ఇతర వైద్య పరికరాలు తదితర అంశాలన్నింటిని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

 

అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్న పిల్లలకి అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర బరువు తూచే యంత్రాలు, పిల్లల వివరాలు అన్నింటిని అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆమె చిన్న పిల్లలకు చాక్లెట్లను పంపిణీ చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడే విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామ ర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాథ మిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన, డాక్టర్ దివ్య, తహసిల్దార్ మధుసూదన్, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.