Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi : పాత భవనాల స్థానంలో కొత్త భవ నాలకు ప్రతిపాదనలు సిద్ధం

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Tripathi :ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోపాతబడిన అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రా లు ,ఏరియా ఆసుపత్రుల స్థానంలో నూతన భవనాల నిర్మా ణానికి ప్రతి పాదనలు సమర్పిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండలాల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించా రు .అలాగే పాతబడిన అద్దె భవ నాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను వెంటనే కొత్త భవనా లలోకి మార్చాల్సిందిగా ఆమె ఆదేశించారు.ప్రజావాణి కార్యక్ర మంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

 

 

 

అనంతరం ఆమె జిల్లా అధికా రుల సమ్మిలిత సమావేశంలో వివి ధ అంశాలపై సమీక్ష నిర్వ హించా రు.రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి ప్రారంభించిన రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులన్నింటిని నెలాఖరులోగా పరిష్కరించాలని జిల్లాలోని అందరూ రెవెన్యూ డివిజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .అలాగే ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని చెప్పారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జిల్లా స్థాయితో పాటు ,మండల గ్రామస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతంగా చేయాలని సూచించారు.

 

అంగన్వాడి కేంద్రాలు పాత అద్దె భవనాలలో నిర్వహిస్తున్నట్లయితే పడిపోయేందుకు అవకాశం ఉందని, దానివల్ల పిల్లలకు ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నందున వెంటనే కొత్త భవనాలలో కి మారాలని ఆమె సూచించారు. అలాగే జిల్లాలోని పాత భవనాలలో నిర్వహించే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు ,అంగన్వాడీ కేంద్రాల స్థానంలో నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని మండలాల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

 

 

ఈ సోమవారం సుమారు( 119 ) మంది పిర్యాదుదారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ తో పాటు, అధికారులకు సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జంతువులపై క్రూరత్వాన్ని ప్రదర్శించకుండా అవగాహన కల్పించేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు ,గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి,పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.