— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటన
Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా అమలు చేయను న్న రైతు భరోసా ,ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, కొత్త రేషన్ కార్డులు, ఇందిర మ్మ ఇండ్ల కోసం నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామ సభలలో భాగం గా మొదటి రోజైన మంగళవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 223 గ్రామస భలు, 48 మున్సిపల్ వార్డు సభలను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గ్రామ, వార్డు సభల నిర్వహణ విషయమై మంగళవారం ఆమె మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు తో టెలికాన్ఫరేన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయని, 21వ తేదీన 223 గ్రామసభలు నిర్వహించాల్సి ఉండగా, 223 కు 223 నిర్వహించామని, అలాగే 182 మున్సిపల్ వార్డులు ఉండగా, 21న 48 వార్డు సభలు నిర్వహించాల్సి ఉండగా, 48 కి 48 నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సబల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆమె తెలిపారు. కొన్నిచోట్ల జాబితాలలో పేర్లు లేవని తమ దృష్టికి వచ్చిం దని, అయితే ప్రస్తుతం గ్రామ సభలో చదువుతున్న జాబితాలోని పేర్లు ఇదివరకు వచ్చిన దరఖా స్తులను పరిశీలించి చదువుతు న్నవి మాత్రమేనని స్పష్టం చేశారు ఇది అనుమతి పొందిన జాబితా కాదన్నారు. ఎవరి పేర్లైనా జాబితాలో రాకపోతే గ్రామ సభలో ఆయా పథకాలకు దరఖాస్తులు ఇస్తే తీసుకొని వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ప్రత్యేక అధికారులు, గ్రామసభ బృందాలు గ్రామసభలను ఓపికగా నిర్వహించాలని, ప్రజలకు ఆయా పథకాలపై ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలని బాధ్యతగా పనిచేయాలని ఆమె కోరారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారు లతో పాటు, ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పారస రఫరాల అధికారి వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణం పీడీ రాజ్ కుమార్, తదితరులతో ఆయా పథకాల కింద గ్రామసభల అనుభవాలను అడిగి తెలుసుకు న్నారు.