Tripathi : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఉద్యోగులు తన కుటుంబ సభ్యులలాంటి వారిని ఎల్లప్పుడూ వారికి తన వంతు సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు.శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, నల్గొండ జిల్లా శాఖ రూపొందించిన టి జి ఓ డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు.
జిల్లాలో టీజీవో భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తిస్తే వెంటనే కేటాయిస్తామని ఆమె తెలిపారు .అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాల అమలులో గజిటెడ్ అధికారులు ఎప్పటికప్పుడు తమ వంతు కృషి చేస్తూ నల్గొండ జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకు వెళ్ళేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గజైటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు, రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు,జిల్లా అధికారులు హాజరయ్యారు.