Tripathi : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: నార్కట్ పల్లి చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మో త్స వాల సందర్భంగా మరోసారి ఏర్పా ట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికా రులను ఆదే శించా రు.శనివారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంబం ధిత అధికారులతో కలిసి చెరువు గట్టును సందర్శించారు.
ఇదివరకే చెరువుగట్టు బ్రహ్మోత్స వాల ఏర్పా ట్లపై ఆయా శాఖల అధి కారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గతంలో జారీ చేసిన ఆదేశాల ప్ర కారం విధులు నిర్వహించాలని, భక్తులకు ఎలాం టి అసౌకర్యం కల గకుండా చూసుకోవాలని పునర్ఘ టించారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవా ల సందర్భంగా ముఖ్యమైన రోజు ల్లో రద్దీని దృష్టి లో ఉంచుకొని భక్తు లకు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా ఏర్పాట్లు చేయాలన్నారు.
క్యూ లైన్లు, టికెట్ కౌంటర్లు, తాగునీరు, వేచి ఉండేం దుకు టెంట్లు, అన్ని ఏర్పాట్లు మరోసారి సమీక్షించుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉత్స వాలను నిర్వహించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికా రి వెంక య్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి డాక్టర్ పుట్ల శ్రీనివా స్, డిప్యూ టీ డిఎంహెచ్ఓ వేణుగో పాల్ రెడ్డి, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, నార్కెట్పల్లి తహసిల్దార్ తదితరు లు ఉన్నారు.