Triveni Degree College: ప్రజా దీవెన, కోదాడ:మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University)మంగళవారం ప్రకటించిన సెమిస్టర్ డిగ్రీ ఫలితాలలో కోదాడ త్రివేణి డిగ్రీ కళాశాల (Triveni Degree College)విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మంచి ఫలితాలు సాధించారని త్రివేణి డిగ్రీ విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి (Chairman Bananala Vasantha Venkata Reddy) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు కళాశాలకు చెందిన ఆర్ .భాగ్యలక్ష్మి రెండవ సెమిస్టర్ లో 10/10 జిపిఏ గ్రేడ్ , నాలుగో సెమిస్టర్ లో ఎం.డి దానిష్ ఉజ్మా 9.88, ఆరో సెమిస్టర్ లో దొంగరి స్వస్తిత 9.52, కొండా ప్రసన్న 9.48 జిపిఏ గ్రేడ్ సాధించారు. ఈ సందర్భంగా త్రివేణి డిగ్రీ విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి (Chairman Bananala Vasantha Venkata Reddy)విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.