డిపిసి ఆమోదoతో రవాణా శాఖలో పదోన్నతులు
ప్రజా దీవెన, హైదరాబాద్:రవాణా శాఖలో ఖాళీగా ఉన్న డిటిసి, జె టి సి పదోన్నతులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపా ర్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. రంగారెడ్డి డిటిసి మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , మహబూబ్ నగర్ డి టి సి శివ లింగయ్యలను జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదో న్నతి కల్పిస్తూ డిపిసి ఆమోదం తెలిపింది.
అదే సందర్భంలో ఉప్పల్ ఆర్టీవో వాణి , ఖమ్మం ఆర్టీవో ఆఫ్రిన్, మెహ దీపట్నం ఆర్టీవో కిషన్ కొత్తగూడెం ఆర్టీవో సదానందం నాగోల్ ఆర్టీవో రవీందర్ కుమార్ సూ ర్యాపేట ఆర్టీవో సురేష్ రెడ్డి లను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Tronsport department