Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Trs ex MLAs media conference: ప్రజాభిప్రాయo పై నిర్బందాల పాలన

--ప్రజల పక్షాన బిఆర్ఎస్ పోరా టాలకు సిద్ధం --రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తీవ్ర నష్టం --నల్లగొండ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల, రవీం ద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్

ప్రజాభిప్రాయo పై నిర్బందాల పాలన

–ప్రజల పక్షాన బిఆర్ఎస్ పోరా టాలకు సిద్ధం
–రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తీవ్ర నష్టం
–నల్లగొండ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల, రవీం ద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్

ప్రజా దీవెన, నల్లగొండ: పచ్చని పొలాల్లో విషం చిమ్మేందుకు, ప్రజ ల నిలువునా ముంచే సిమెంట్ ఫ్యాక్టరీ కి ఏమి ఆశించి రామన్న పేట లో అనుమతి ఇచ్చారని బిఆర్ఎస్ నేతలు ( BRS leaders) తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ( Ref erendum)  అంటూ తమ నాయకులను ఎందుకు నిర్బంధించా రని ప్రశ్నించారు. రామన్నపేట ప్రజల పక్షాన తాము పోరాటానికి సిద్ధ మని బిఆర్ఎ స్ జిల్లా పార్టీ అధ్య క్షులు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే లు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగ య్య, నోముల భగత్, కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మె ల్సీ కోటిరె డ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ (cement factory) ఆ ప్రాంత ప్రజలకు కలి గే ఇబ్బందులను గమనించాలని, పచ్చటి పొలాలతో అలరారు తు న్న ఆ ప్రాంతాన్ని కాలుష్య కాసారం చేయాలని చూస్తు న్నారా, ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతించబోమని, ప్రజల పక్షా న ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. కాంగ్రె స్ పార్టీ నాయకులారా ( congress party leaders) ఇప్పటికై నా కళ్లు తెరిచి ప్రజల పక్షాన నిలబడండి, పోలీస్ జులుంతో ప్రజాభి ప్రాయ సేకరణకు తమ నాయ కులను వెళ్ళనీయకపోవడం సిగ్గుచే టని వ్యాఖ్యానించారు.

ప్రోటోకాల్ లో ఉన్న తనను కూడా అడ్డుకోవడం ప్రజాస్వామ్య మా, అనువు కాని ప్రాంతంలో సి మెంటు ఫ్యాక్టరీ నా అంటూ ఎమ్మె ల్సీ కోటిరెడ్డి నిలదీశారు. రా మెటీ రియల్ లేదు, నీళ్లు లేవు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏమిటి దీని వెను క ఏదో కుట్ర దాగి ఉందని, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister komatireddy venkatreddy) , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (mla rajgopal Reddy) ఇప్పుడు ఎక్కడకి పోయారు, మూసి కాలుష్యంపై బిఆర్ఎస్ పార్టీ నాయకులపై తెగమాట్లాడేసిన మీరు ఇప్పుడు రామన్నపేట లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మీ అభిప్రాయం ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ ప్రాంత ప్రజల మంచి కోరే వారైతే తక్షణమే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేయించాలని, దీనిపై మీ సోదరులు ఇద్దరే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రామన్నపేటలో అoభుజా సిమెంట్ (ambuja Cement)  ఫ్యా క్టరీ ఏర్పాట్లు ఏదో మతల బుందని, అందుకే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రజలను నాయ కులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి అక్కడికి పోకుండా చేశారని ఆరో పించారు. ఏమీ లేకపోతే పోలీస్ నిర్బంధం ఎందుకని, ఎవరి ప్రోద్బలంతో పోలీసులు, నాయకులను అడ్డుకు న్నారో రాచకొండ పోలీస్ కమిషనర్(rachakonda police co mmissionar)  సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

రాజ్యాంగ పదవిలో ఉన్నానంటూ సుద్ధ పూసలు చెప్పే పెద్ద నాయ కులు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసి ప్రక్షాళన ( Close cleaning)  పై తమ నాయకులపై ఆవాకులు చవాకులు పేలిన వారు ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పై ఏం చెప్తారు, ఓ పక్క మూసి కాలుష్య ప్రక్షాళన అంటూ పేదల బతుకులు ఛిద్రంచేస్తూ మరో పక్క సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యాన్ని నల్గొండ (nalgonda)  ప్రజలకు అందిం చాలని చూస్తున్నారని దుయ్య బట్టారు. ఆ ప్రాంత ప్రజల పోరాటా లకు తామం తా అండగా ఉంటా మని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాక ర్, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, నల్లగొండ మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీని వాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి, నల్ల గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, ఏడో వార్డ్ కౌన్సి లర్ మారగోని గణేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, రంజిత్ , మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, మా తంగి అమర్, కందుల లక్ష్మయ్య, తిప్పర్తి మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, విద్యార్థి విభాగం నాయకుడు నాగార్జున,కందిమల్ల నరేందర్ రెడ్డి,ఫణి, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Trs ex MLAs media conference