Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TS SET 2023 Results : టీఎస్ ఎఫ్ సెట్ ఫలితాలల్లో

–రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన రేస్ విద్యార్థులు

TS SET 2023 Results : ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విడుదల చేసిన తెలంగాణ ఎఫ్ సెట్ ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటి, మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు.

ఎఫ్ సెట్ విభాగంలో కళాశాలకు చెందిన తిప్పన రోహిత్ రెడ్డి 1302, పోసాని వంశీ 1881, పల్లా సూర్య ప్రకాష్ 2976, యలగొండ దీపిక 3125, కట్టమూరి కీర్తన 4410, బాణాల మహా శ్రీ కౌశిక్ 4871, కుసుమ విక్షిత కుమార్ 4921, జనగాం ఓజస్వి 5472, సయ్యద్ హుజూఫా 5956, కొండ చక్రధర్ గౌడ్ 6338, అక్కినేపల్లి గగన్ కుమార్ 6482, కుంటి గొర్ల మణికంఠ 6635, షేక్ అంజుమ్ 7731, శివ జ్యోతి 7840, షేక్ సమీర్ 8656, బానోత్ మధు ప్రసాద్ 8934, సన్నీ 9688 ర్యాంకులు సాధించారు. మెడికల్ విభాగం నుండి సన్నప రెడ్డి సిరి 8245, మహమ్మద్ మోహిసిన్ 9745 ర్యాంకులు సాధించినారు.

ఈ సందర్భంగా రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ,జాతీయ స్థాయి ఇంజనీరింగ్, మెడికల్ విభాగంలో ప్రతి సంవత్సరం అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ ర్యాంకులు సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో ఇంకా అత్యుత్తమ ఫలితాలను సాధించుటకు కృషి చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ర్యాంకుల సాధనలో కృషిచేసిన అధ్యాపకులను, విద్యార్థులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.