Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TSRTC : ఆర్టీసీ ఉద్యోగులు సమాజానికి ఆదర్శం

జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి

TSRTC : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ రీజియన్ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కే జాన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండ్ ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెడ్ క్రాస్ ఛైర్మెన్ పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతతో పాటు ప్రయాణికుల భద్రత కూడా ముఖ్యమని సమాజానికి తమ వంతు సేవ చేయాలని ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు రక్తదాన చేయడం అభినందనీయమని, గతంలో కూడా అనేకసార్లు ఆర్టీసీ ఉద్యోగులు రక్తదాన శిబిరం నిర్వహించారని, గత సంవత్సరం అత్యధిక సార్లు రక్తదానం చేసిన నల్గొండ ఆర్టీసీ ఉద్యోగులు వెంకట్ రెడ్డి 51సార్లు మరియు ఎం ప్రభాకర్ రావు 38 సార్లు రక్తదానం చేసినందుకుగాను రాష్ట్రస్థాయి గవర్నర్ అవార్డులు అందుకున్నారని తెలియజేస్తూ ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు.

 

ఈ సందర్బంగా రీజినల్ మేనేజర్ జాని రెడ్డి మాట్లాడుతూ మా సిబ్బంది ఉద్యోగంతో పాటు ప్రయాణికుల క్షేమంగా ఉండాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారుల సూచనతో జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలలో భాగంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో ప్రతి సంవత్సరం సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నామని అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఏడు డిపోల నుండి ఉద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగిందని, దాదాపు 105 యూనిట్స్ రక్తాన్ని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కి అందించామని ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ అధికారుల కార్మికుల లక్ష్యమని అందుకు ప్రజలు సహకరించాలని కోరుతూ, రక్తదానం చేసిన ఆర్టీసీ సిబ్బందికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ అధికారులు డిప్యూటీ ఆర్ ఎం లు ఎం మాధవి, శివశంకర్, డిపో మేనేజర్ శ్రీనాథ్, ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్ ఎన్నమల్ల అంజయ్య, నేతి విప్లవ కుమార్, సద్దాం హుస్సేన్, రెడ్ క్రాస్ సిబ్బంది మెడికల్ ఆఫీసర్ సివి రాములు వివిధ డిపోల మేనేజర్లు ఆర్టీసీ కార్మికులు సిబ్బంది ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.