–టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి
TSUTF Rajasekhar Reddy : ప్రజాదీవెన నలగొండ టౌన : పెండింగ్ డిఎ లను వెంటనే ప్రకటించాలని పిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆ జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసా చారి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు పరిష్కారం కాక ఆవేదనలో ఉన్నారని, నాలుగు పాత డీఏలు వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయ ఉద్యోగులకు వెంటనే పిఆర్సిని విడుదల చేయాలని.
ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, రిటైర్ అయిన ఉపాధ్యాయుల కు రావలసిన అన్ని రకాల ప్రయోజనాలను వెంటనే విడుదల చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మరొ రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు బడుగు అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కోశాధికారి వడ్త రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జి.అరుణ, జిల్లా కార్యదర్శులు సిహెచ్. రామలింగయ్య, గేర నరసింహ, ఎం. శ్రీనివాసరెడ్డి, ఆర్. రమాదేవి, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, వేదశ్రీ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఏం. మురళయ్య, వివిధ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.