— ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ
TTD : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డి అధికారులను ఆదేశించా రు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు.
యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మా దిరే యాదగిరిగుట్ట ఆలయం సమీ పంలో రాజకీయాలకు తావులేకుం డా చూడాలని, ఆలయ పవిత్రత కు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్ర మాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం పలు మా ర్పులు సూచించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామ య్యర్, ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు , ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొ న్నారు.