–అభివృద్ధి ,సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే ముందుంచుతాo
–రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
Tummala Nageswara Rao: ప్రజా దీవెన నిడమనూరు: అభివృద్ధి ,సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందుంచేం దుకు తమ ప్రభుత్వం కృషి చేస్తు న్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) అన్నారు. ఒకరోజు పర్యటన లో భాగంగా బుధవారం అయన నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన నిడమనూరు నూ తన వ్యవసాయ మార్కెట్ కమిటీ (Agricultural Market Committee)ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమా నికి ముఖ్యఅ తిథిగా హాజరయ్యా రు. గత ప్రభుత్వ హయాంలో దారి తప్పిన పాలనను గాడిలో పెట్టేందు కు తమ ప్రభు త్వం కృషి చేస్తు న్నదని, ఇందులో భాగంగానే రైతు లకు 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడం జరి గిందని, ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలను రైతుల అకౌం ట్లలో జమ చేసామని, దీపా వళి లోపు తెల్ల కార్డులు లేని నాలుగు లక్షల మంది రైతులకు వారి ఖాతా లలో 2 లక్షల రూపా యలు జమ చేస్తామన్నారు.2 లక్షల రూపాయ లకు మించి రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేస్తామ ని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తమ ప్రభుత్వం ఒకే పంట కాలంలో పెద్ద మొత్తంలో 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నేల్ ద్వారా జిల్లా అంతటికి సాగు నీరు అందిస్తామని తెలిపారు .రాష్ట్రంలో రైతుబంధు, పంటల బీమా, రైతు భరోసా ఇస్తామని తెలిపారు.
రైతులు ఆయిల్ ఫామ్ తోటలను పెద్ద ఎత్తున సాగు చేయాలని, ఈ సంవత్సరం రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు (Oil palm plantations) వేశారని ,10 లక్షల ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు సాగుచేసి రైతులు లాభాలు పొందవచ్చని, అంతేకాక ప్రభుత్వము ఆయిల్ పామ్ తోటలకు ఎకరాకు 50 వేల రూపాయల సబ్సిడీ సైతం అందిస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉందని ,రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్ లో దేశంలోనే ముందుండాలని మంత్రి ఆకాంక్షించారు.
దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు పండించేందుకు అవకాశం ఉందని, రైతులందరూ ఆయిల్ పామ్ తోటలు వేసుకొని లబ్ధి పొందాలని కోరారు. రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)మాట్లాడుతూ రైతులకు సేవ చేసే అవకాశం, రైతులకు అలాగే ప్రభుత్వానికి వారధిగా పనిచేసే అవకాశం మార్కెట్ కమిటీలకు ఉంటుందని అన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ కి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం 150 కోట్ల రూపా యలతో కులమతాలక తీతంగా ఇంటెగ్రేటెడ్ హాస్టల్లను నిర్మిస్తున్నా మని ,7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్న ప్పటికీ ప్రతి నెల మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామ ని అన్నారు. 70 కోట్ల రూపాయల తో ముకుందాపురం- ఆల్వాల్ రోడ్డుకు వచ్చే వారంలో టెండర్లు పిలవనున్నామని , నల్గొం డ జిల్లాకు ఆర్ అండ్ బి శాఖ (R&B department) ద్వారా 516 కోట్లు రోడ్లకు కేటా యించామని, గతంలో రహదా రులను రెన్యువల్ చేసిన పాపాన పోలేదని ,తామ వచ్చిన తర్వాత అన్ని రోడ్లను రెన్యువల్ చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బిసిని 10 సంవ త్సరాలు ఆపిందనితాము వచ్చిన తర్వాత తిరిగి ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టినట్టు వెల్లడించారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి మాట్లా డుతూ నూతన వ్యవసాయ మార్కె ట్ కమిటీ రైతులకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే సేవ చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అన్నారు.
మిర్యాల గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (Battula Lakshmareddy)మాట్లాడుతూ నాగార్జు నసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు రావడం, అదేవిధంగా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు.జిల్లా కలెక్టర్ సి .నారాయణరెడ్డి మాట్లా డుతూ రైతులు బాగున్నప్పుడే అందరు బాగుంటారని, అలాంటి రైతు సంక్షేమం కోసం మార్కెట్ కమిటీలు పనిచేయడం సంతోషమని అన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీకీ (Agricultural Market Committee)ఆయన శుభా కాంక్షలు తెలియజేశారు. కార్యక్ర మానికి అధ్యక్షత వహించిన నాగా ర్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి మాట్లా డుతూ నూతన వ్యవ సాయ మార్కెట్ కమిటీ రైతులకు మెరు గైన సేవలు అందించాలని ఆకాం క్షించారు. నిడమనూరు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంపటి సత్య నారాయణ, ఉపాధ్యక్షులు బుసిరెడ్డి శ్రీని వాస రెడ్డిలు మాట్లాడుతూ రైతు లకు పూర్తిస్థాయిలో అందుబా టులో ఉండి సేవలం దిస్తామని అన్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొనగా, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయదేవి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ,వైస్ చైర్మన్, డైరెక్టర్ లతో ప్రమాణ స్వీకారం చేయిం చారు. ఈ కార్యక్రమంలో పలు వురు ప్రజాప్రతినిధులు, అధి కారులు పాల్గొన్నారు.