*అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇస్తాం.
*దేశం లోనే వరి ఉత్పత్తి లో తెలంగాణ అగ్రగామి.
*గోదావరి జలాలు పాలేరు ద్వారా కోదాడ కి తీసుకొస్తాం …….
*ఇందిరమ్మ రాజ్యం లో అభివృద్ధి, సంక్షేమం జోడేడ్లుగా పరిగెడుతున్నాయి
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రులు
Tummala Nageswarao :
ప్రజా దీవెన, కోదాడ: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రాష్ట్రం నీటిపారుదల శాఖ పౌరసరఫరాల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు నల్లమాద పద్మావతి రెడ్డి గారితో కలిసి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ సైన్యం నుండి జన సైన్యం లోకి వచ్చిన నేత మీ ఉత్తమన్న అని, వారు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం సహచర మంత్రుల ద్వారా నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.భవిష్యత్ లో గోదావరి జలాలను పాలేరు ద్వారా కోదాడ కి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, గోదావరి జలాలను తరలించి కోదాడ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేయటమే నా జీవిత లక్ష్యం అని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల వద్దకి పాలన తెచ్చి ప్రజల మధ్యనే లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించేందుకే ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు.వ్యవసాయం చేయు భూములకే రైతు భరోసా కింద సంవత్సరానికి ప్రతి ఎకరానికి 12000 అందిస్తామని తెలిపారు.కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ లు అందరికి శుభాకాంక్షలు తెలుపుతు రైతు సంక్షేమం కోసం మీరు అంత కృషి చేయాలని సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం మార్కెట్ కమిటీ లను సందర్శించి ఎలా రైతుల సంక్షేమం కోసం పని చేస్తూ ఉన్నాయో తెలుసుకొని ఒక అవగాహన పెంచుకోవాలని తదుపరి కోదాడ మార్కెట్ పరిధిలో ఎలా రైతులు కోసం ఎలా పని చేయాలో నిర్ణయించుకొని వ్యవసాయ శాఖ మంత్రి సహాయం తో అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.
వానకాలంలో 66.7 లక్షల ఎకరాలలో 155 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి లో దేశం లోనే తెలంగాణ అగ్రగామిగా నిలబడిందని తెలిపారు. ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న, కులగణన లో, మీ సేవలో దరఖాస్తు చేసుకున్న కానీ, ఇంకా రేషన్ కార్డులు లేని వారు గ్రామ సభలోకానీ తర్వాత ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవ కేంద్రం లో గానీ దరఖాస్తు చేసుకున్నా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి తెలిపారు.జనవరి 26 నుండి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు నిరంతరం ఇస్తామని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అందరికి ఉపయోగపడేలా, సంతృప్తి గా తినేలా ప్రతి వ్యక్తికి 6 కేజీల సన్న బియ్యం ఉచితంగా ఇస్తామని మంత్రి తెలిపారు.గత పది యేండ్లు గా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని డబులు బెడ్ రూమ్ పేరుతొ కాలయాపన చేసి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదని ఇందిరమ్మ రాజ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.
మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా రైతు కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12000 ఆర్థిక సహాయం చేస్తమని అన్నారు. గత 30 యేండ్లు గా నా మీద, ఎమ్మెల్యే పద్మావతి మీద చూపెట్టిన ప్రేమ, ఆప్యాయతలలి కృతజ్ఞత తెలియజేస్తూ మీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కి కృషి చేస్తున్నామని కోదాడలో ఈ ఒక్క సంవత్సరంలోనే 100 పడకల హాస్పటల్ నిర్మాణానికి ప్రారంభం చేసుకున్నామని 250 కోట్లతో ఇంటిగ్రెటెడ్ పాఠశాల నిర్మించాబోతున్నామని, రోడ్లు, త్రాగు నీరు సాగు నీరు అందిస్తున్నామని ఇలా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
అవసరం ఉన్న ప్రతి చోట కాలువలు, లిప్ట్ లు నిర్మిస్తానని మంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోదాడ తీసుకొచ్చి ఆర్ టి సి డిపో ని మోడల్ డిపో గా అభివృద్ధి చేయుటకు 18 కోట్లు మంజూరు చేపించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమక్షేమం అభివృద్ధిలో జోడెద్దుల పరుగులు తీస్తుందని తెలిపారుకోదాడ శాసన సభ్యురాలు నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ రైతుల సంక్షేమం కొరకు నిజాయితీగా పనిచేసి మనన్నలు పొందాలని సూచించారు.అంతకుముందు మార్కెటింగ్ అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, వైస్ చైర్మన్ బషీర్, అలాగే డైరెక్టర్ లచే ప్రమాణ స్వీకారం చేపించారు.
చైర్మన్ తిరపతమ్మ మాట్లాడుతూ మాపై నమ్మకం తో ఈ బాధ్యత అప్పగించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ధన్యవాదములు తెలుపుతూ రైతులకి మెరుగైన సేవలు అందించి అంకితభావం తో పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యెర్నేని వెంకటరత్నం రాష్ట్ర ముస్లిం మైనారిటీ నాయకులు ఎంఏ జబ్బార్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పార సీతయ్య జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేంద్ర శర్మ, మార్కెటింగ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.