Tunnel Accident : ప్రజా దీవెన, నల్లగొండ: దేశ వ్యా ప్తంగా సంచలనంగా మారిన శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం ప్రమాదం వద్ద సహాయక చర్యలు కొనసాగు తూనే ఉన్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న రకరకాల సహాయక చర్యలు మరిం త ముమ్మరంగా సాగుతున్నాయి. గత అయిదు రోజులుగా సొరంగం లో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకు వ చ్చేందుకు అందుబాటులో ఉన్న అ న్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా రు. ఇండియన్ మెరెయిన్ కమాం డో ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ విభాగాన్ని మార్కోస్ అని పిలుస్తుం టారు. ఈ కమాండోస్ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతుoటారు. ఆపరేషన్ మా ర్కోస్ రంగంలోకి దిగిన నేపథ్యంలో కార్మికులు బయటకు వస్తారని అం దరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరి గిన ప్రాంతానికి చేరుకునేందుకు సొ రంగంపై నుంచి కాని, పక్క నుం చి కానీ లోపలకు వెళ్లే మార్గాలను కూ డా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ సహా పలు సహాయక బృందాలు వారి వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇ ప్పటి వరకు సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు మాత్రమే చేరుకున్నాయి. అక్కడ ధ్వంసమై న టీబీఎం పరికరాలు ఉండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలు గుతోంది. మరోవైపు 11.5 కి.మీ నుంచి ఎయిర్ సప్లయ్ పైప్‌లైన్ వ్యవస్థ ధ్వంసమైంది. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ నిపుణులు బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం టన్నెల్లో 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉన్న ట్టు అధికారులు అంచనా వేస్తు న్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నా రు. కన్వేయర్ బెల్ట్‌తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముందని చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. పైకప్పు కూలి నచోట 70 శాతం బురద, 30 శా తం నీళ్లు ఉండటంతో అక్కడ అ డుగు వేయడానికి వీలులేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరం గంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారింది.
అ యితే ఇక అక్కడి పరిస్థితిని రె స్క్యూ టీం సభ్యులు వీడియో తీ శారు. ఇక్కడ చాలా ప్రమాదకరం గా ఉండి పైకప్పునకు క్రాక్ వచ్చిం ది. కూలిపోయే ప్రమాదం ఉండడం తో ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్దాం పదండి అంటూ రెస్క్యూ టీం సభ్యులు వీడియోలో మాట్లా డడం గమనార్హం. ఇక మంగళవా రం రాత్రి సమయానికి ఎన్టీఆర్ఎఫ్, ర్యాట్ మైనింగ్ నిపుణులు ప్రమాద స్థలానికి 40 మీటర్ల దగ్గరకు చేరు కోగా ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వెన క్కి వచ్చేశారు. అదేవిధంగా ఈ బృందం బుధవారం ఉదయం టన్నె ల్ లోకి వెళ్లింది. టన్నెల్ లోకి వెళ్లి వచ్చేందుకు నాలుగు గంటల సమ యం పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా సొరంగం విషాద సంఘటన కథా కమీషు ఎలా ఉంటుందో అన్న ఆందోళన, ఆత్రుత సర్వత్రా నెల కొంది.