TUTF: ప్రజా దీవెన, సూర్యాపేట: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (Telangana United Teachers Federation)సూర్యాపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా టీయూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు దామెర శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులుగా టీయూటీఎఫ్ (TUTF) సంయుక్త కార్యదర్శి ఊట్కూరి జానకి రాములు వ్యవ హరించారు. టీయూటీఎఫ్ నూతన కార్యవర్గం : టీయూటీఎఫ్ (TUTF) జిల్లా గౌరవ అధ్యక్షులుగా కటకం నరసింహ స్వామి,అధ్యక్షులుగా మామిడి అరవిందు,ప్రధాన కార్యదర్శిగా కస్తూరి కిషన్ ప్రసాద్ (Kasturi Kishan Prasad)మరియు సహాధ్యక్షులుగా దంతాల జవహర్,మహిళా సహాధ్యక్షులుగా పప్పు నీరజా లత,సంయుక్త కార్యదర్శిగా నక్కపోతు శ్రీనయ్య,శ్రీరామోజు రామ మోహనా చార్యులు,మహిళా సంయుక్త కార్యదర్శిగా బెల్లంకొండ నీలిమ,ఆర్దిక కార్యదర్శిగా మహ్మద్ షఫి,జిల్లా కార్యదర్శులుగా చాడ నరోత్తం రెడ్డి,శివరాత్రి వెంకన్న,నోముల వెంకన్న,తాటిపాముల శ్రీనివాస చారి,బొడ్డు శ్రీనివాస్,మహిళా కార్యదర్శిగా సారగండ్ల మహేశ్వ రి,అడిట్ కమిటీ కన్వీనర్ గా అక్కి నపల్లి శ్రీనివాస రావు లను ఎన్ను కున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.