TUWJ IJU : ప్రజా దీవెన, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో టీయూడబ్ల్యూజే -ఐజే యూ బలోపేతం చేసేందుకు సభ్య త్వ నమోదు కార్యక్రమాన్ని చేపడు తున్నట్లు యూనియన్ రాష్ట్ర కా ర్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షు లు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా యూనియన్ కార్య వర్గ సమావేశం తొర్రుర్ లోని శ్రీరస్థు బ్యాంకెట్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 3 వ తేదీ వరకు జిల్లాలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత జిల్లా మహాసభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ మహాసభల సందర్భంగా జిల్లాలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఆయా నియోజకవర్గాలకు జిల్లా కమిటీ బాధ్యులు, ఆయా ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. జిల్లా బాధ్యులు సమిష్టిగా కృషి చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యునియాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మాఫీసిల్ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ గుడిపల్లి శ్రీనివాస్, జాతీయ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సలీమ్ పాషా, సత్యనారాయణ,జిల్లా ఉపాధ్యక్షులు కటకం సుభాష్, కార్యదర్శులు,కోశాధికారి సంరెడ్డి శశిపాల్ రెడ్డి, రాజేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.