Tuwj union : జర్నలిస్టులకు ట్రేడ్ యూనియన్ లపై అవగాహన అవసరం
--మీడియా అకాడమీ లోతైన అధ్యయనం తర్వాత ఆరోగ్య కార్డులు --టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
జర్నలిస్టులకు ట్రేడ్ యూనియన్ లపై అవగాహన అవసరం
–మీడియా అకాడమీ లోతైన అధ్యయనం తర్వాత ఆరోగ్య కార్డులు
–టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
ప్రజా దీవెన, మేడ్చల్: విలేకరులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొం దించుకోవడమే కాకుండా, ట్రేడ్ యూని యన్ విది విధానాలపై అవ గాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కిం గ్ జర్నలిస్టుల సంఘం (tuwj) రాష్ట్ర అధ్యక్షులు కె.వి రాహత్ అలీ సూచించారు.
మంగళవారం యూనియన్ మేడ్చల్ మల్కాజ్ గిరి (malkaajgiri ) జిల్లా శాఖ, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ ల నేతృత్వంలో శేషాద్రి నగర్ క మ్యూనిటీ హాల్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా యూనియ న్ మేడ్చల్ మల్కాజిగిరి అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశం లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ లో గ్రేటర్ హై దరాబాద్ (greater Hyderabad ) నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్న బాద్యులను జర్నలిస్టులు సత్కరిం చారు. రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీని గజమాలతో ఘనంగా సత్క రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యం లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నా రు. గడిచిన పదేళ్ల కాలంలో విలేకరుల సమస్యలు పరిష్కారానికి నోచుకోక అనేక ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జర్నలిస్టుల (journalist) గొంతుకగా పోరాటం చేస్తున్న కె.శ్రీనివాస్ రెడ్డికి ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవిని అప్పగించడం ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసిందన్నారు.
మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మును పెన్నడూ లేని విధంగా స మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో(minister po nguleti Srinivas Reddy) విలేకరుల సమస్యలపై తరచుగా సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ నిర్ల క్ష్యం వల్ల జర్నలిస్టులు ఆరోగ్య పథకాన్ని కోల్పోవడంతో, సరైన వైద్య సదుపాయాలు అందక పలువురు విలేకరులు ప్రాణాలను కోల్పో యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత నిస్తూ త్వరలోనే హెల్త్ కార్డులను ( health cards) అందిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. అర్హుడైన ప్రతి విలేఖరికి అక్రిడిటేషన్ అందా ల్సిన అవసరం ఉందని, అయితే మార్కెట్లో విచ్చల విడిగా ఎవరికి పడితేవారికి అక్రిడిటేషన్లు దొరకడం విచారకరమన్నారు. నికార్సైన జర్నలిస్టులు మార్కెట్లో అంగడి సరుకుగా మారిన అక్రిడిటేషన్లను( acridatation) అడ్డుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ మండల జిల్లా కేంద్రాలుగా పరిగణలోకి తీసుకుంటూ ఇళ్ల స్థలాలను (house lands) మంజూరు చేసే విధంగా యూనియన్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఓ సంఘం ప్రభుత్వం తమ జేబులో ఉందని చెప్పుకుంటూనే జర్నలి స్టులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు బహిరం గంగా ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ పాలాభిషేకాలు చేస్తూ లేని పోని భ్రమలను కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సం ఘాలతో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంద న్నారు.
*టియుడబ్ల్యూజె నూతన కమిటీ కి సన్మానం*…టీయూడబ్ల్యూజే నూతన రాష్ట్ర కమిటీ లో గ్రేట్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహి స్తున్న జర్నలిస్టు నాయకులను ఈ సందర్భంగా సన్మానించారు. కోశా ధికారిగా ఎన్నికైన మోతే వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాం త్ రెడ్డి, అయితే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, గౌస్ మొయిను ద్దీన్, అనిల్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బా బా, ప్రధాన కార్యదర్శి అశోక్, హెచ్ యు జే అధ్యక్షులు శిగ శంకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్కయ్య, మామిడాల రవీందర్ రెడ్డి, సలీం పాషా, తొట్ల పరమేష్, మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి లను ఈ సంద ర్భంగా ఘనంగా సన్మానించారు.
జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాల రాజు అధ్యక్షత వహించిన సమా వేశంలో జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి కరీం, రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tuwj union