Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TWF State Committee : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ నిరసనలు

-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పి లుపు

TWF State Committee : ప్రజా దీవెన, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతి ప త్రాలు సమర్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడ బ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమా వేశం నిర్ణయించింది. జర్నలిస్టులం తా ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. హైద రాబాద్ లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్య క్షుడు మామిడి సోమయ్య అధ్యక్ష తన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ స మావేశం గురువారం జరిగింది. సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య గత కార్యకలా పాలు, భవిష్యత్ కార్యాచరణ పై నివేదిక సమర్పించారు. ఈ స‌మా వేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జి ల్లాలకు చెందిన ఫెడరేషన్ ఆఫీస్ బేరర్లు,కార్యవర్గ సభ్యులు పాల్గొని ఆయా అంశాలపై సుదీర్ఘ చర్చ జరి పారు. దీర్ఘకాలంగా అపరిష్కృతం గా ఉన్న జర్నలిస్టుల సమస్యలతో పాటు తక్షణం పరిష్కరించాల్సిన పలు అంశాలపై సమావేశంలో చ ర్చించి తీర్మానాలు చేశారు. సమా వేశం ఆమోదించిన తీర్మానాలను ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామి డి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య గురువారం మీడియాకు విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రె డిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పెన్షన్ స్కీం, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు, చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ గుర్తింపు, జర్నలిస్టుల రక్షణకు ప్ర త్యేక చట్టం తదితర డిమాండ్ల పరి ష్కారాని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేస్తూ తీర్మానించిందని తెలిపారు.

గత ప్రభుత్వం జర్నలి స్టుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంత వరకు ఏ ఒక్క స మస్యను పరిష్కరించలేదని అన్నా రు. జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేష న్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వకుం డా జీవో 239 సమీక్ష, సవరణ కమి టీ పేరుతో కాలయాపన చేస్తున్న దనీ,దీని వల్ల జర్నలిస్టులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. తాము అధికా రంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూ పి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న దని వాఖ్యానించారు.జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కొత్త ప్రభుత్వానికి ఏడాదిగా సమ యం ఉన్నా, ఇంత వరకు పరిష్క రించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

25 నుంచి సభ్యత్వ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25వ తేదీ వరకు నెల రోజుల పాటు ఫెడరేషన్ సభ్య త్వ నమోదు కార్యక్రమం చేపట్టా లని సమావేశం తీర్మాణం చేసిం ది.అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు జరుగుతుందని, జర్నలిస్టులంతా ఐక్యత, హక్కుల సాధన కోసం ఫెడరేషన్ లో సభ్యులుగా చేరి భవిష్యత్తు కార్యాచరణలో భాగ స్వాములు కావాలని వారు పిలు పునిచ్చారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల ఫెడరేషన్ మహాసభలు నిర్వహించాలని, మార్చి 29న రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరపాలని సమావేశం నిర్ణయిం చినట్లు వారు తెలిపారు. సమా వే శంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షు లు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, బండి విజయ్ కుమా ర్, ఎల్గొయి ప్రభాకర్, గుడిగ రఘు, కొప్పు నిరంజన్, విజయానంద్,
కోశాధికారి రాచమల్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శులు ఎస్ కే సలీమా, ఈ చంద్రశేఖర్, తన్నీరు శ్రీనివాస్, కర్రా అనిల్ రెడ్డి, బి జగదీష్,బి రాజశే ఖర్, జి ప్రభు, గండ్ర నవీన్, కార్యవ ర్గ సభ్యులు మణిమాల, కె. పాండు రంగారావు, నాయిని శ్రీనివాసరావు పి. నాగవాణి,పరిపూర్ణం, రమేష్, మధుకర్, జ్యోతిబసు అరుణ్ కు మార్ తదితరులు పాల్గొన్నారు.