Union Bank of India : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో ఏర్పా టుచేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా కొత్త బ్రాంచ్ ఏర్పాటు వల్ల కనగల్ తో పాటు, చుట్టుప క్కల ప్రాంతాల ప్రజలకు సౌకర్యం గా ఉంటుందన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన గల్ మండల శాఖ నల్గొండ జిల్లాలో 25వ ది అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఆర్. సత్యనారాయణ తెలిపారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా తెలంగాణ చీఫ్ జనరల్ మేనే జర్ కారే భాస్కర రావు మాట్లా డుతూ కనగల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు తమ బ్యాంకింగ్ సేవలు అందజేయడానికి అత్యా ధునిక సౌకర్యాలతో ఈ శాఖను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఏటీఎం. మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలతో పాటు ఖాతాదారులు ఎస్ టి పి . ద్వారా లోన్లు పొందడం వంటి అనేక సౌకర్యాల్ని తమ బ్యాంకు కలుగజేస్తోందని మండలంలో ప్రతి ఖాతాదారులు ఈ ఆధునిక సౌకర్యాలను తమ బ్యాంకు కలగజేస్తోందని ఈ సౌకర్యాలు అన్ని మండలంలోని ఈ ఖాతాదారుడు అందుకునేలా చేయటమే తమ లక్ష్యం అని అన్నారు. ఎం ఎస్ ఎం ఈ ,రుణాలు వీటితో పాటుగా రైస్ మిల్లు, దాల్ మిల్లు వంటి పరిశ్రమల రుణాలు కూడా అవసరమైన ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు నుంచి తీసుకోవాలని కోరారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా తమ సేవలను మండలంలోని మారుమూల ప్రాంతాలకు అందజేసేలా తాము ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్రీ ఏ మురళీకృష్ణ, చీఫ్ మేనేజర్స్ శ్రీమతి రాజేశ్వరి, శ్రీ రాజేష్ ,శ్రీ రఘురాం, బి ఆర్ ఎం శ్రీ కోటేశ్వరరావు, నూతన బ్రాంచ్ శాఖ మేనేజర్ శ్రీ మోహన్ ఎల్డిఎం శ్రామిక్ కనగల్ తహసిల్దార్ పద్మ పాల్గొన్నారు.