Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

United Pastors Association: కోదాడ ఇన్చార్జి తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన సూరయ్యకు సన్మానం

United Pastors Association: ప్రజాదీవెన,కోదాడ: కోదాడ ఇంచార్జ్ తాసిల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టిన సూరయ్యకు సోమవారం యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ (United Pastors Association)కోదాడ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో తన విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదిగి నేడు డిప్యూటీ తాసిల్దారుగా పదవి బాధ్యతలు చేపట్టటం అభినందనీయమని తెలిపారు సూరయ్య (Suriya) అంచలంచెలుగా ఎదిగి ప్రజలకు మంచి సేవలు అందించి పేరు ప్రఖ్యాకులు తెచ్చుకోవాలని తెలిపారు.

రానున్న రోజులలో ఉన్నత పదవులు చేపట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు అలాగే క్రైస్తవ సమాజానికి కావలసిన పనులలో సహకారం అందించాలని యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ (United Pastors Association) అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ చైర్మన్ డాక్టర్ సిహెచ్ లూకా కుమార్, కోర్ కమిటీ మెంబర్ జి ఆర్ అబ్రహం, కో ఆర్డినేటర్ ఎం సుందర్ రావు, నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ రాజేష్, టౌన్ ప్రెసిడెంట్ కే ప్రభుదాస్, మండల ప్రెసిడెంట్ శాంత వర్ధన్, టౌన్ సెక్రటరి హ్యారీ గొమ్స్, సలహాదారులు పాండు తదితరులు పాల్గొన్నారు అనంతరం విశ్వమాత మదర్ తెరిసా జయంతి (Mother Teresa’s birth anniversary)వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు