— తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: విశ్వవిద్యా లయాల వేదికగా ప్రజావిచారణ చే పట్టుతున్న తెలంగాణ విద్యా కమి షన్ మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ప్రజా విచార ణ చేపట్టింది. తెలంగాణ విద్యా క మిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ఆచార్య పి ఎల్ విశ్వేశ్వర రావు, డా చారకొండ వెంకటేష్, శ్రీమతి జ్యోత్స్న శివారెడ్డి లు ప్రజా విచారణ చేపట్టారు. ఉద యం విశ్వవిద్యాలయం చేరుకున్న కమిషన్ సభ్యులు విశ్వవిద్యాల యంలోని వివిధ విభాగాలను సం దర్శించి మౌలిక వసతులను ప్రత్య క్షంగా పరిశీలించారు.
మొదట విశ్వవిద్యాలయ ప్రస్థానం ప్రస్తుత స్థితిగతులపై ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ప వర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అధి కా రులు విశ్వవిద్యాలయ అధ్యా పక, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో విశ్వవిద్యాలయంలో నెలకొన్న వివి ధ సమస్యలు, అవసరాలపై ప్రజా విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ తెలంగాణ సాధన లో ప్రముఖ పాత్ర పోషించిన విశ్వ విద్యాలయాలు అభ్యున్నతికి సైతం తోడ్పడాలన్నారు. విద్య విముక్తి, అ భ్యున్నతికి,దీర్ఘకాలిక ప్రయోజనా లను అందించే ఉత్తమ సాధనంగా , నైపుణ్యాలను అందించి నైతికత, సమతా భావన, దేశభక్తిని పెంపొం దించే గురుతర బాధ్యత విశ్వవి ద్యాలయాలపై ఉందన్నారు.
అనంతరం కమిషన్ విద్యార్థులు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది , విద్యార్థి సంఘాలతో పాటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో తమ సమస్యలపై చర్చించారు. ఈ సం దర్భంగా విద్యార్థులు తమ కళాశా లలు, క్రీడా సదుపాయాలు, హాస్ట ల్లో నెలకొన్న సమస్యలపై కమిషన్ ముందు ఉంచారు. సదుపాయాల తో పాటు పోటీ పరీక్షల సమాయ త్తానికి వెసులుబాటు కల్పించాలని కోరారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యా లు రియంబర్స్మెంట్ 4 సంవత్సరా ల బకాయిల వల్ల తాము ఎదుర్కొం టున్న సమస్యలను కమిషన్ ముం దు ఉంచారు. కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులు తమ సమ స్యలను కమిషన్కు వివరిస్తూ సర్వీ సుల క్రమబద్ధీకరణతో పాటు, సర్వీ స్ గుర్తింపు ద్వారా తమకు న్యా యం చేయాలని కమిషన్ కోరారు. అవుట్సోర్సింగ్ విధానం ద్వారా 25 0కి పైగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉ ద్యోగులు మూడు అంచల వేతన విధానం ద్వారా ఉద్యోగులు నష్టపో తున్నట్లు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ విధా నాన్ని రద్దు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య అల్వాల రవి, ప్రిన్సిపాల్ డా శ్రీ దేవి, డా అరుణప్రియ,, డా సుధా రాణి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ఆచార్య రేఖ, డా మదిలేటి, డా మిరియాల రమే ష్, డా దోమల రమేష్ తదితర అ ధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నా రు.