Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Upadhyay MLC : విద్యారంగ పరిరక్షణ కోసం ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపించాలి

Upadhyay MLC : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ నుండి వరంగల్ ఖమ్మం నల్లగొండ శాసనం మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయులచే పెద్ద ఎత్తున ర్యాలీ బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది.

 

ఉపాధ్యాయులు భారీ ర్యాలీగా నర్సిరెడ్డి ని గెలిపించాలని నినాదాలు ఇస్తూ నల్లగొండ జిల్లా కేంద్రం ప్రధాన రహదారి గుండా భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి గారి వెంట చావారవి ,అనిల్ కుమార్ ,శ్రీనివాస్, దుర్గ భవాని, ఏ ,వెంకట్ ,పాలకుర్తి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

 

అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన అలుగుబెల్లి నర్సిరెడ్డి స మావేశానికి టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఖమ్మం నల్లగొండ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న జరుగుతున్న ఎన్నికలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమని తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం పేద ప్రజల పిల్లలకు సమానమైన నాణ్యమైన విద్య అందటానికి శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకను గెలిపించడానికి ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, పది సంవత్సరాలలో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైందని కార్పొరేట్ శక్తులు విజృంభించడం .

 

ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు నెలకొల్పబడటం మూలాన సామాన్యునికి విద్య అందుబాటులో లేదని అందుకోసం శాసనమండలిలో విద్యారంగం పరిరక్షణ కోసం ప్రభుత్వంతో పోరాడే అభ్యర్థి ని గెలిపించుకోనే బాధ్యత ఉపాధ్యాయులదని, గత 6 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అనేక సమస్యలపై ప్రభుత్వ విద్యారంగ పక్షాన సామాన్య ప్రజల పక్షాన పోరాటం చేశానని రాష్ట్రంలోని అన్ని గురుకులాల విద్యాసంస్థలను సందర్శించి వాటి సంక్షేమం కోసం వాటిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడి సాధించానని అపరిస్కృతంకాని సమస్యలను మళ్లీ గెలిస్తే సాధించి తీరుతానని నేను ప్రభుత్వ పక్షం కానీ ప్రతిపక్షంగాని కాదని ఉపాధ్యాయుల పక్షమని అందరి కోసం విద్యారంగా అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేస్తానని తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ కు బడ్జెట్లో నిధులు పెంచడానికి కృషి చేస్తానని .

 

ఉపాధ్యాయుల ప్రధాన సమస్య అయిన సిపిఎస్ విధానం రద్దుకు అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ల గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాడతానని అన్నారు. ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు కోసం కృషి చేయాలని అభ్యర్థించారు.టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రోల్ మోడల్ గా ఉపాధ్యాయ ప్రతినిధిగా ప్రజల మనిషిగా పని చేశారని అందుకోసం మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టి పి టి ఎఫ్ సంఘం తరఫున కరీంనగర్ లో పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి అశోక్ కుమార్ కుమార్ ని గెలిపించాలని కోరారు.

 

టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ రెండు నియోజకవర్గాలలో మన అభ్యర్థులను గెలిపించాలని ఈ ఎన్నికలలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని విద్యారంగం బలోపేతానికి కృషి చేయటానికి మన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నర్సిరెడ్డి తన ఎమ్మెల్సీ నిధులను 100% పాఠశాలల అభివృద్ధికి కేటాయించారని వ్యాపారవేత్తలను మద్యం వ్యాపారులను గెలిపిస్తే విద్యారంగం నాశనం అవుతుందని అన్నారు.లెక్చరర్ల బదిలీలు రెగ్యులరైజేషన్ల సమస్యల సాధనలో నర్సిరెడ్డి కృషి చాలా గొప్పదని అన్నారు.

 

 

తెలంగాణ గురుకులాల ఉపాధ్యాయ సంఘాల చైర్మన్ మామిడి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగం కుంటుపడుతోందని దాని ప్రక్షాళన కోసం నైతిక విలువలు కలిగిన ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని ఉద్యమాల గడ్డ నల్లగొండ పోరాటాల గడ్డ వరంగల్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి నర్సిరెడ్డి ని గెలిపించాలని కొందరు ప్రత్యర్ధులు తమ గెలుపు కోసం కుల వైశమ్యాలను రెచ్చగొడుతున్నారని దానిని తిప్పి కొట్టాలని అన్నారు .

 

విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగంలో ఉండాలని కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలలో అనేక సమస్యలపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పోరాటం చేశారని కాకతీయ విశ్వవిద్యాలయానికి తన నిధుల నుండి 20 లక్షలు సెమినార్ హాల్ కు కేటాయించారని మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయం ఉద్యోగులకు రిటర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు మంజూరు చేయించారని యూనివర్సిటీలలో అధ్యాపకులు 22 శాతం మాత్రమే ఉన్నారని మిగతా వారందరూ కాంట్రాక్టు లెక్చరర్లే అని వాటి అభివృద్ధి కోసం కృషి చేసే అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

 

టి పి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం తిరుపతి మాట్లాడుతూ సమ సమాజం కోసం నాణ్యమైన సమానమైన విద్య కోసం యుటిఎఫ్ టి పి టి ఎఫ్ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని చట్టసభలకు డెమొక్రటిక్ విలువలు కలిగిన వ్యక్తులను పంపాలని పౌర సమాజం ఆమోదించే వ్యక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అని వారిని గెలిపించాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో టీఎస్ యూ టీ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్, తెలంగాణ మోడల్ స్కూల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కొండయ్య మహేష్, కేజీబీవీ సంస్థల నాయకులు మంజుల, టి పి టి ఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మనోహర రాజు, టి పి టి ఎఫ్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ రవీందర్, నల్లగొండ జిల్లా యుటిఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సురేష్, పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధే శ్యామ్, సాంఘిక సంక్షేమ గురుకులాల అధ్యక్షులు ఎల్లయ్య తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్షులు మహేష్ బి సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నితిన్ ,ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర కోశాధికారి రవికుమార్, బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లివిన్ స్టాన్, గిరిజన సంక్షేమ పాఠశాలల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే జంగయ్య, సిహెచ్ దుర్గ భవాని, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక సంపాదకులు ఈ మాణిక్ రెడ్డి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కే సోమశేఖర్, జి నాగమణి, ఏ సింహాచలం, టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి నాగిరెడ్డి, గురుకుల సంస్థల రాష్ట్ర కార్యదర్శిలు మహేష్, రాంబాబు,
నల్లగొండ జిల్లా టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు బడుగు అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కోశాధికారి వడిత్య రాజు, టీఎస్ యుటిఎఫ్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శి సిహెచ్ రామలింగయ్య, వీర నరసింహ, మిట్టపల్లి మురళయ్య, నలపరాజు వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, అరుణ రమాదేవి, కొమ్మరాజు సైదులు పాల్గొన్నారు.