— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Upadhyaya MLC : ప్రజా దీవెన నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేష న్లను దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.
శుక్రవారం నామినేషన్లు వేసిన వారిలో భారతీయ జనతా పార్టీ నుండి పులి సరోత్తమ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. తక్కిన 12 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు.
వారిలో ఏలే చంద్రమోహన్, ఎస్. సుందర రాజ్, దామెర బాబురావు, పూల రవీం దర్, తలకోల పురుషోత్తం రెడ్డి, డాక్టర్ కొలిపాక వెంక టస్వామి, చాలిక చంద్రశేఖర్, కంటే సాయన్న, జంగి టి కైలాసం, గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డిలు ఒక్కో నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు.
పింగిలి శ్రీపాల్ 2 సెట్లు, అలుగుబెల్లి నర్సిరెడ్డి 3 సెట్ల నామినేషన్లను స్వతంత్ర అభ్య ర్థులుగా నామినేషన్ దాఖ లు చేశారని ఆమె వెల్లడించారు.
నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్, వరంగల్-ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జె.శ్రీనివాస్,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ లు ఉన్నారు.