Uppala Lingaswamy : ప్రజా దీవెన,సంస్థాన్ నారాయణపు రం : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి జన్మదినం సందర్భంగా నారాయణ పురం గ్రామ ప్రజల అవసరాలకై అత్యవసర సేవల కొరకు తన పుట్టి నరోజు సందర్భంగా అంబులెన్స్ సేవలను ఉచితంగా అందించారు లింగస్వామి.
ఈ నేపథ్యంలో నవీన హాస్పిటల్ హస్తినాపురం వారిచే ఫ్రీ హెల్త్ క్యాం పు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు అందిం చారు.గ్రామ ప్రజల బాగోగులకై అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న లింగస్వామికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.