–ఎస్ఎస్సి మూల్యాంకన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి
–అన్ని రకాల ఉపాధ్యాయులను ఇన్విజిలేషన్ విధులలో నియమించాలి
–యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి
UTF Rajasekhara Reddy : ప్రజాదీవెన నల్గొండ : గత ఏడాది పదవ తరగతి రెమ్యూనరేషన్ ను వెంటనే చెల్లించకుంటే ఎస్ఎస్సి మూల్యాంకనాన్ని బహిష్కరిస్తామని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి, అయినా ఇప్పటివరకు 2024 సంవత్సరపు పదవ తరగతి పరీక్షల పేపర్ మూల్యాంకన చేసిన ఉపాధ్యాయులకు రెమ్మునరేషన్ ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. పేపర్ మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులు ఒక సంవత్సరం కాలం పాటు రెమ్యూనరేషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించిందని విమర్శించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే లోపు 2024 సంవత్సరంలో ఎస్ఎస్సి మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రావలసిన మూల్యాంకన రెమ్యూనరేషన్ ను వారి ఖాతాలో జమ చేయకపోతే పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
పదవ తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ కేవలం ఎస్జిటి ఉపాధ్యాయులను ఉపయోగించడం మూలంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని కావున అన్ని రకాల ఉపాధ్యాయులను ఇన్విజిలేషన్ విధులలో నియమించాలని కోరారు.నేటి నుండి జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులను నిబంధనల ప్రకారం కేటాయించాలని డిమాండ్ చేశారు. వేరే మండలంలో పనిచేసే ఉపాధ్యాయులను జిల్లా కేంద్రంలో పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ నియమించడం నిబంధనలకు విరుద్ధమని, దీనిని సరి చేయాలని డీఈఓ ను డిమాండ్ చేశారు. పదవ తరగతి స్పాట్ కేంద్రంలో పేపర్లు దిద్దడానికి వచ్చే ఉపాధ్యాయులకు తగిన వసతులను కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాస్ ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి, టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, మురలయ్య, పగిళ్ళ సైదులు, వేదశ్రీ, కొమర్రాజు సైదులు, నరసింహమూర్తి, యరనాగుల సైదులు, శ్యామ్ మరియు వివిధ మండలాల బాధ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.