Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy:ఎస్సీ వర్గీకరణ పై అమాత్యుల కమిటీ

–చైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మెoబర్లుగా ఐదుగురు మంత్రులు, ఒక ఎంపీ
–సుప్రీం తీర్పుపై అధ్యయనం, సి ఫారసులకు ప్రభుత్వం ఆదేశం

Uttam Kumar Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్‌: షెడ్యూల్డు కులాల(ఎస్సీ) వర్గీ కరణపై (sc caste) అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏ ర్పాటు చేసింది. ఇందులో ఐదుగు రు మంత్రులు(ministers)ఉండగా ఒక ఎంపీ ఉన్నారు. ఈ మేరకు సీఎస్‌ శాం తికుమారి ఉత్తర్వులు జారీ చేశా రు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(utam Kumar Reddy)చైర్మన్‌గా, మంత్రులు దామోదర, దుద్దిళ్ల, పొన్నం, సీతక్కతో (Sitakka)పాటు ఎంపీ మల్లు రవిని సభ్యులుగా నియమించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎస్సీల వర్గీకరణ చేపట్టాలంటూ ఆగస్టు 1న సుప్రీం తీర్పును అనుసరించి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తీర్పును అధ్యయనం చేయాలని, ఉప వర్గీ కరణకు సంబంధించిన అన్ని అం శాలను పరిశీలించాలని కమిటీకి తెలిపింది. ఆ తర్వాత ఎస్సీ వర్గీ కరణపై (sc)ఎలా ముందుకు వెళ్లాలో సూచిస్తూ ప్రభుత్వానికి సిఫార సులు చేయాలని ఆదేశించింది.