Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: ఎవరినీ ఉపేక్షించేది లేదు

–తనిఖీలు ముమ్మరం చెయ్యాలి
–పట్టుబడితే చర్యలు కఠినంగా ఉండాలి
–పెట్రోలు బంక్ లతో పాటు వేయిం గ్ మిషన్ ల మోసాలపై నిఘా
–తూనికలు కొలతల శాఖపై ప్రజ ల్లో అవగాహన కల్పించాలి
–సమస్త జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహించాలి
–రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తూనికలు కొలతలలో అవక తవ కలకు పాల్పడితే ఎంత మాత్రం ఉపే క్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) హెచ్చరించారు.ఈ.ఓ.డి.బి( ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్)చట్టం పే రుతో వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశా రు. మంగళవారం మధ్యాహ్నం బిఆర్ అంబెడ్కర్ (BR Ambedkar) సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్య క్షతన తూనికలు కొలతల శాఖా సమీక్ష సమావేశం నిర్వహించారు.

పౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖా ముఖ్య కార్యదర్శి డి.యస్.చౌహన్, తూనికలు కొల తల శాఖా సహాయ కార్యదర్శి ప్రి యాంక,అసిస్టెంట్ కంట్రోలర్ రాజే శ్వర్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)మాట్లాడుతూ తూనికలు కొలతల శాఖపై వినియోగదారులలో చైతన్యం పెంపొందించాడంతో పాటు ప్రజలు మోసపోకుండా ఉం డేలా తరచు తనిఖీలు నిర్వహిం చాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పెట్రోల్ బంక్(petrol bunk) లతో పాటు వేయింగ్ మిషన్ లపై నిఘా పెంచాలని ఆయన సూచించారు. తద్వారా ప్రజలను మోసాల బారిన పడకుండా చూడొచ్చన్నారు.జిల్లాల వారిగా తరచు సమీక్షలు నిర్వహిం చాలని ఆయన చెప్పారు. తూనిక లు కొలతల శాఖాలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.అదే సమయంలో శాఖా పరంగా సిబ్బం ది ఎదుర్కొంటున్న సమస్యల సత్వ ర పరిష్కారానికి కృష్జి చేస్తామన్నా రు.