*దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగం కీలకం.
కోదాడ లారీ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Uttam Kumar Reddy:ప్రజా దీవెన, కోదాడ: దేశ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుందని భారీ నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని స్థానిక గుడుగుంట్ల.అప్పయ్య ఫంక్షన్ హాల్ (Appiah Function Hall) లో నిర్వహించిన ది కోదాడ లారీ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో అయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల సమావేశంలో ఆల్ ఇండియా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పలు సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని,పాతలారీలకు గ్రీన్ టాక్స్ తగ్గించడంతోపాటు ఏపీ, తెలంగాణకు చెందిన వేల లారీలు కేవలం ఈ రెండు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేస్తుంటాయని వీటికి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరి లారీ యజమానులకు డబ్బు ఆదాయం అవుతుందని తెలిపారు. అదేవిధంగా పెరిగిన ఇన్సూరెన్స్,డీజిల్ ధరలతో (Insurance, diesel prices)రవాణా రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లారీ యజమానుల కష్టాలు తనకు తెలుసు అని వీలైనంత తొందరలో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రవాణా రంగం దేశ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు.
అనంతరం అసోసియేషన్ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ చైర్మన్ షణ్ముగప్ప, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్అరవింద్ అప్పాజీ,ఏపీ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ నాయుడు, తెలంగాణ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రామినేని. శ్రీనివాసరావు, తెలంగాణ జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్,కోదాడ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తూనం. కృష్ణ, మున్సిపల్ చైర్మన్ సామినేని.ప్రమీల,డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఎం వి ఐ జిలాని, ఆవుల. రామారావు, కొల్లు.ప్రసాదరావు, ఎండి. రఫీ, ఎలమందల. నరసయ్య, నాగేశ్వరరావు, నరసరాజు, పెద్ది. అంజయ్య తదితరులు పాల్గొన్నారు………..