Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: సంక్రాంతి నుండి రైతులకు రైతు భరోసా: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

*రైతులను సంపన్నులు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది:మంత్రితుమ్మలనాగేశ్వరరావు
*కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం : మంత్రి పొన్నం ప్రభాకర్
*కోదాడ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కృషి జీవ: పద్మావతి రెడ్డి

Uttam Kumar Reddy ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను సంపన్నులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు నల్లగొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ,రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్థానిక శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు, శుక్రవారం మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో 20 కోట్ల రూపాయల నిధులతో కాపుగల్లు నుండి రెడ్ల కుంట గ్రామం వరకు రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను సంపన్నులు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందుకు రైతులు అవకాశం ఉన్న ప్రతి చోట పామాయిల్ తోటలు పెంపకాలు వేయాలని సూచించారు.

పామాయిల్ తోటలు వేసే ప్రతి రైతుకు ఎకరాకు 51000 సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుందని పామాయిల్ తోటలు పెంచే రైతుల వద్దకే వచ్చి వారు పండించిన పంటను కొనుగోలు చేస్తుందని తెలిపారు కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే డబ్బు వారి ఖాతాలలో జమవుతుందని అన్నారు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు అప్పటికి ఉన్నప్పటికీ రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన 7,625 కోట్లు రైతుబంధు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు.

అలాగే 3000 కోట్ల రూపాయలు రైతు బీమా కింద కేటాయించామని గుర్తు చేశారు, అలాగే రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి నుండి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మించిన పురోగతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని రైతులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రుల సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి కోదాడ నియోజకవర్గానికి అభివృద్ధికి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు డిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి డిసిసి మాజీ చైర్మన్ ముత్తారపు పాండు రంగారావు కాపుగల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు తొండపు సతీష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు