— భవన నిర్మాణానికి రూ. 14.35 కోట్ల నిధులు విడుదల
–ఐదు కోర్సులలో 216 మందికి అవకాశం
–ప్రిన్సిపాల్ తో సహా 8 పోస్టుల మంజూరీ
Uttam Kumar Reddy: ప్రజా దీవెన హుజూర్ నగర్: హుజుర్ నగర్ నియోజకవర్గ అభి వృద్ధి పై మరోమారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)అభివృద్ధి మార్క్ ను ఆవిష్కరించారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న పారిశ్రా మిక శిక్షణా సంస్థ(ఐ.టి.ఐ) మంజూరయింది. ఐ.టి.ఐ మం జూరు చేయించడంతో పాటు శాశ్వత భవన నిర్మాణానికి (Permanent building construction) గాను స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్త మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)రూ. 14.35 కోట్లు నిధులను విడుదల చేయించారు.
ఎలక్ట్రిషియన్,ఫిట్టర్,డ్రాఫ్ట్స్ మెన్, డీజిల్ మెకానిక్Electrician, Fitter, Draftsman, Diesel Mechanic) లతో పాటు వెల్డర్ కోర్సులలో శిక్షణ నిమిత్తం ప్రారం భిస్తున్న ఈ నూతన ఐటిఐ తో ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రయోజన కారిగా మారనుంది.మొత్తం ఐదు కోర్సులలో 216 విద్యార్థులతో ప్రారంభం కానున్న ఈ ఐ టి ఐ కి ప్రిన్సిపాల్ (Principal of ITI) తో సహా 8 పోస్టులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పించి మంజూరు చేయించారు. గతంలో తాను మంజూరు చేయించిన అడ్వాన్డ్ ట్రైనింగ్ సెంటర్ సమీ పంలో రామస్వామి గుట్ట వద్ద కొత్త గా మంజూరు అయిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ. టి.ఐ)నీ నెలకొల్ప నున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.