-సంతాన ప్రాప్తి కోసం సైదులుకు మొక్కులు
–400 ఏళ్ళ నాటి ప్రాశస్త్యంతో విరాజిల్లుతున్న దర్గా
–సఫాయిబావి నీరు సర్వరోగ నివారణకు మందు
–వాడపల్లి రాజు పర్యటనతో వెలుగులోకీ వచ్చిన స్థలపురాణం
–ఈ నెల 23,24,25 లలో ఉర్సు ఉత్సవాలు
— నేడు ఉర్సు ఉత్సవాలను సమీ క్షించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : ప్రజా దీవెన హుజూర్ నగర్: సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 23,24,25 లలో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఇక్కడ జరిగే ఉర్సు ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు సందర్శిం చనున్న నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు జాన పహాడ్ దర్గాను సందర్శించను న్నారు.400 ఏళ్ల నాటి జానపహాడ్ దర్గా ప్రాశస్త్యం కాపాడేందుకు గాను హుజుర్నగర్ నుండి వరుసగా మూ డు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక యి,అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో మం త్రిగా విధులు నిర్వర్తిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవిరళ కృషి చేస్తున్నారు.అందులో బాగంగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న ప్పుడు 60 లక్షల నియోజకవర్గ అభి వృద్ధి నిధులను దర్గా అభి వృద్ధి పనులకు కేటాయించారు.
ఈ నిధులతో సందల్ ఖాన (గంధం సత్రం)నిర్మాణం,యాత్రికుల వసతి గృహాల నిర్మాణం,ఐదు వాటర్ ట్యాన్క్ ల ఏర్పాటు,స్పాట్ హౌస్ సి.సి ఫ్లోరింగ్ తో కలిపి,మసీదు షెడ్ నిర్మాణంతో పాటు గెస్ట్ హౌస్,దర్గా లోపటి క్యూ లైన్ స్టాండ్ లను ఏర్పాటు చేశారు.
అంతే గాకుండా తిరిగి తెలంగాణా రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజగా దర్గా అభివృద్ధి కోసం కోటి 11 లక్షల రూపాయలను మంజూరు చేసి దర్గా పై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.
ఈ నిధులతో సందల్ ఖానా గంధం సత్రం దగ్గర డ్రైనేజీ, బాత్ రూమ్ లు,మసీదు దగ్గర షెడ్లు,దర్గా దగ్గర రెండు బోర్ మోటార్లు,దర్గా చుట్టూ,దర్గా ముందు సి.సి.రోడ్లు,సందల్ ఖానా (గంధపు సత్రం) దగ్గర సి.సి.ఫ్లోరింగ్, మసీదు దగ్గర సి.సి రోడ్లతో పాటు డ్రైనేజీ నిర్మాణపు పనులు,సందల్ ఖానా బావి దగ్గర నుండి డ్రైనేజీ నిర్మాణపు పనులను చేపట్టారు.
ఇంతటి ప్రాశస్త్యం కలిగిన జానపహాడ్ దర్గా అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందిస్తున్న చేయుతను గుర్తించిన జానపహాడ్ సైదులు భక్తులు 400 ఏళ్ల కిందట దర్గా ఉత్సవాలను ప్రారంభించిన శేషారెడ్దిని గుర్తుకుతెచ్చుకుంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే జానపహాడ్ ప్రాశస్త్యం గుర్తించి అక్కడ 400 ఏళ్ల కిందట దివంగత శేషారెడ్డి ఉర్సు ఉత్సావాలను ప్రారంభిస్తే… ఆ ఉర్సు ఉత్సవాల పరంపరను కొనసాగించడంతో పాటు దర్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉర్సు ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతులు సమకూరుస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది దర్గా అభివృద్ధిపై కెప్టెన్ మార్క్ వేసుకున్నారనే చెప్పుకోవలసి ఉంటుంది.