–అధికారులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister UttamKumarReddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి మహార్దశ పట్టుకుంది. రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తు న్న హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి బైపాస్ రహదారి ఏర్పా టుకు రంగం సిద్ధమవుతోంది.ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా అధికారులతో సమావేశమై విస్తృ తస్థాయిలో సమీక్షించారు. ప్రతిపాదిత బైపాస్ రోడ్డు ప్రణాళిక లకు అనుగుణంగా తగిన రీతిలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చే యించారు. జడ్చర్ల నుండి కోదాడ వరకు జాతీయ రహదారి విస్తరిం చిన నేపద్యంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బైపాస్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు పెరుగుతున్న రోడ్డు ప్రమా దాల నివారణకు బైపాస్ రోడ్ ఏర్పాటు సరైన మార్గమని భా వించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగం గానేజాతీయ రహదారుల.రోడ్లు,భవనాల శాఖాధి కారులు పలు రకాలుగా రూపొందించిన బైపాస్ రహదారి నమూనాలను గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు. అందుకు ఎటు వంటి అభ్యంతరాలు తలెత్తకుండా ఉండేందుకు గాను అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో సమీక్షిం చారు. ఈ బైపాస్ రహదారి ఏర్పా టుతో మొత్తం హుజుర్ నగర్ ని యోజకవర్గానికి ప్రయోజనం కలగ డంతో పాటు దూరప్రాంతల నుండి వచ్చే వాహనాలు నేరుగా కోదాడ, ఖమ్మం, విజయవాడలకు నేరుగా వెళ్లేందుకు వేసులు బాటుగా ఉంటుంది. నియోజకవర్గ పరిధి లోని గరిడేపల్లి,నెరేడుచర్ల మం డలాలకు చెందిన ప్రజలు హుజూర్ నగర్ తో నిమిత్తం లేకుండా నేరుగా కోదాడ ఆపై ప్రాంతాలకు వెళ్లేందు కు వెసులుబాటు కలుగుతుంది.
రాయని గూడెం వద్ద ప్రారంభ మై ….రాయనిగూడెం వద్ద మొద లయ్యే ఈ బైపాస్ రోడ్ నేరుగా మా ధవరాయని గూడెం వద్ద హుజుర్ నగర్, కోదాడ రహదారి మార్గం మ ధ్యలో ఉన్న ఎన్.ఎస్.పి కెనాల్ వద్ద కలుస్తుంది. ఈ మేరకు గురు వారం రోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ రగదారుల విభాగానికి చెందిన రోడ్లు భవనాల అధికారి శ్రీధర్ ఇతర అధికారుల తో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమా వేశంలో తన్నీర్ మల్లికార్జున్ దొం తగాని శ్రీనివాస్ గౌడ్,కోతి సంపత్ రెడ్డి,సైదులు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.