–అప్పులకు వడ్డీలే ఏటా రూ. 15 వేల కోట్లు చెల్లించాలి
–ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ కమీష న్లు వస్తాయనే ప్రాణహిత, చేవెళ్ల ను రద్దు చేసి రీడిజైన్ చేపట్టారు
–లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
–కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సమీక్ష కు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.9–10 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్రెడ్డి Uttam Kumar Reddy) తెలిపారు. ప్రాజెక్టు పూ ర్తయి పంపులన్నీ పనిచేస్తే విద్యుత్తు ఖర్చు ఏడాదికి రూ.10 వేల కోట్ల దా కా అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి కాగ్ అంచనాల మేరకు వ్యయం చేస్తే.. వడ్డీకి ఏటా రూ.15 వేల కోట్లు, విద్యుత్తు ఖర్చు రూ.10 వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్ల భారం రాష్ట్రంపై పడుతుందని చెప్పారు.
శనివారం ఎన్డీఎస్ఏ ప్రధాన కార్యాలయం లో చైర్మన్ అనిల్ జైన్ (Chairman Anil Jain,), సంస్థ అధికా రులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సలహాదారులు అదిత్యనాథ్ దాస్, కాళేశ్వరం సీఈ సుధాకర్‌రెడ్డి, ఎన్డీఎస్ఏ నియమించిన నిపు ణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదన్నారు. ఐదేళ్ల పాటు మొత్తం లెక్కలు తీస్తే.. కాళేశ్వరంలో మొత్తం పంప్ చేసిన నీళ్లు 65 టీఎంసీలు అని, ఏడాదికి సగటున 13 టీఎం సీలను గత ప్రభుత్వం ఎత్తిపోసిం దని చెప్పారు. రీడిజైన్ పేరుతో ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమీషన్లు వస్తాయనే కక్కుర్తితోనే ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును రద్దుచేసి మేడిగడ్డ నిర్మాణాన్ని చేపట్టారని ఆరో పిం చారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవనే తప్పుడు వాదనను బీఆర్ ఎస్ ఎత్తుకుందని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram project) నాటి బీఆర్ ఎస్ సర్కారు (brs)రూ.లక్ష కోట్ల ప్రజా ధనం ఖర్చు చేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తుమ్మిడి హట్టి వద్ద గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టును కట్టి ఉంటే విద్యుత్తు ఖర్చు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మాత్రమే అయ్యేదన్నారు. తాము ఈ ఐదేళ్లలోనే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కష్టార్జితంతో నిర్మితమైనదని, ఎంత వీలైతే అంత మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. శనివారం భేటీలో ఎన్డీ ఎస్ఏ ఇచ్చిన సలహాలపైౖ కేబినెట్ లో చర్చిస్తామని తెలిపారు. ప్రపం చంలో ఏ బ్యారేజీలోనూ 3–4 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ ఉండవని, కానీ.. కేసీఆర్ తానే ఆర్కిటెక్ట్ అయి16 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా కట్టారని విమర్శిం చారు. కాగా, ఎన్డీఎస్ఏ సమా వేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రెం డున్నర గంటలపాటు సుధీర్ఘంగా సమీక్షించారు. సోమవారం అధి కారుల స్థాయిలో మరోసారి ప్రాజెక్టుపై చర్చలు జరిపి ముందుకె ళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.