Uttam Kumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: ఇటీవల సంభవించిన వర్షపు బీభత్సానికి పడిన గండ్లు పూడ్చి వేతకు యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టిన మరమ్మతుల పనులను మంగ ళవారం రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సర ఫరాల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనస భ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డి (Uttam Padmavati Reddy)లతో కలసి పరిశీలిం చారు.కోదాడ నియోజకవర్గ పరి ధిలోని నడిగూడెం మండలం కాగితం రామచం ద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియా (media)తో మాట్లాడారు. ఎడమ కాలువ గండ్ల పాపం గత బి.ఆర్.యస్ ప్రభుత్వ నిర్వాకమేనని ఆరోపించారు. పదే ళ్ల బి.ఆర్.యస్ పాలన నిర్లక్ష్యానికి నిదర్శనమే కాలువలకు, చేరువు లకు పడిన గండ్లు అని విమర్శిం చారు. లోపభూయిష్టమైన నిర్హ హణ ఫలితానికి తాజా ఘటన పరాకాష్ట అని చెప్పారు. నీటి పారుదల శాఖాను (Irrigation Department)నిర్వీర్యం చేసిం ది చాలక నిందలు వేయడం సిగ్గు చేటన్నారు. వరదలపై రాజకీయ బురద చల్లకండని హితవు పలి కారు. లష్కర్ లతో సహా ఇంజినీర్లు సిబ్బంది నియామకాలు జరిపితే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
మాది రైతుపక్షపాత ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. ఖరీఫ్ (karif)పంట లను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బుధ వారం ఉదయం నుండి సాగర్ నీటి ని విడుదల చేస్తామని స్పష్టం చేశా రు. మేము అధికారంలోకి రాగానే 700 మంది ఏ.ఈ.ఈ లను నియమించామని గుర్తు చేశారు. ఈ నెల 26 న ఎర్రమంజిల్ కాలనీ లోని జలసౌదలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకాపు పత్రాలు అందజే యడం జరుగుతుందని, త్వరలో 1800 మంది లష్కారుల నియా మకాలు చేపడుతామని పేర్కొ న్నారు. పదేళ్ల వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే విపక్షం విమర్శ లు చేస్తుందని పునరుద్ఘాటించారు.50 ఏండ్ల అనంతరం సంభవించిన విపత్తు సంభవించిన గంటలో క్షేత్ర స్థాయికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy),ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రివర్గంక్షణాల్లో నష్ట నివారణ చర్యలు చేప ట్టామని, పంట నష్టం జరగకుండా చర్యలకుపక్రమించామని తెలి పారు. సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతల్లో పంటపొలాలలో చేరిన నీటిని తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశామని, గండ్లు పడిన ప్రాం తాలను ఆఘమేఘాల మీద సంద ర్శించామన్నారు. షార్ట్ టెండర్లను పిలిచి పునరుద్ధరణ పనులు చే పట్టామని, ఇది రైతుపక్షపాత ప్రభుత్వనైనందున రైతాంగానికి ప్రభుత్వం బాసటగా నిలు స్తోందన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
