–బక్కమంతుల గూడెంలో 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ శంఖుస్థా పనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హుజూర్ నగర్: మఠంపల్లి మండలాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేవిధంగా అభివృ ద్ధి చేస్తానని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై (State Irrigation, Civil Supply)మంత్రి నల్లమా,ద ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో రూ .2.5 కోట్లతో నిర్మించే 33/11 కె వి విద్యుత్ ఉప కేంద్రానికి (power substation) శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ విద్యుత్ ఉప కేంద్రం కోసం ప్రజలు, రైతులు దశాబ్ద కాలంగా కోరు తున్నారని, ఇప్పు డు ఆ కోరిక నెరవేరిందన్నారు.
సుల్తానపూర్ (Sultanpur)తండా వద్ద ఎన్ సీఎల్, చెన్నాయి పాలెం సబ్ స్టేషన్ల పనులు కూడా త్వరగా పూర్తి చేసి అందు బాటులోకి తేవాలని, అలాగే ఏమై నా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని అధికారులకు సూ చించారు.రూ.80కోట్లతో 10 మీటర్ల వెడల్పుతో హుజుర్ నగర్ (Huzur Nagar) నుండి మట్టపల్లి వరకు, రూ.10కో ట్లతో చౌటపల్లి నుండి మేళ్లచెర్వు వరకు, రూ.17 కోట్లతో మట్టంపల్లి నుండి జానపహాడ్ రోడ్ మార్గంలో వర్ధపు రం, రాఘవాపురం వద్ద రెం డు బ్రిడ్జ్ లు, అలాగే రూ.11.5 కోట్ల తో చె న్నాయి పాలెం వద్ద బ్రిడ్జి (Bridge) నిర్మించ టం జరుగుతుందని, త్వరలో పను లు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
అమరవరం, పెద్ద వీడు లిప్ట్ ఇరిగేషన్ (Lift Irrigation)లకి మర మ్మతులు పూర్తి చేసి అందుబా టులోకి తేవటం జరిగిందని, మరిం త ఆయకట్టును పెంచటానికి ఏమై నా లిప్ట్ ఇరిగేషన్లు (Lift Irrigations)అవసరం ఉంటే మంజూరు చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతుల కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, అలాగే గృహజ్యోతి పథకం (Griha Jyoti Scheme) కింద 200 యూనిట్ల లోపు వాడుకున్న వారికి జీరో బిల్లు వస్తుందని, మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో (RTC bus)ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, 500 రూపాయలకే గ్యాస్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎస్.ఈ. సీహెచ్ పాల్ రాజ్, డీఈ లు వెంకట కృష్ణయ్య, డాలి నాయుడు, ఈఈ. కృష్ణ రెడ్డి, తహసీల్దార్ మంగ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.