–పాఠశాల, వసతి గృహ విద్యా ర్థులకు అందిస్తాం
— రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజా దీవెన, సూర్యాపేట : తెలంగాణ విద్యా వ్యవస్థను మార్చడంలో సమీకృత గురుకులాలు కీలక పాత్రను పోషిస్తున్నాయని, నూతన సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో సన్న బియ్యంతో భోజనం అందించనున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి ఆయన హూజూర్నగర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలు కుతూ కుటుంబాలకు దూరం గా ఉంటూ చదువుకుంటున్న విద్యా ర్థులకు ఆనందాన్ని పంచేలా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామని, డైట్ చార్జీలను 40 శాతం మేర, కాస్మటిక్ ఛార్జీలను 200 శాతానికి పైగా పెంచామని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించడానికి వీలుగా కామన్ డైట్‌ను అమలు చేస్తున్నా మన్నారు. ఐఐటీలు, ఎంబీబీఎస్ వంటి అత్యుత్తమ కోర్సులు అభ్య సించేలా చర్యలు తీసుకుం టు న్నామన్నారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే నిధుల నుంచి కాలేజీ ఫర్నిచర్‌కు రూ.10 లక్షలు, గ్రంథాలయ పుస్తకాలకు రూ.5 లక్షలు, క్రీడా సౌకర్యాల మెరు గుదలకు రూ.5 లక్షలు మంజూరు చేశారు. రూ.200 కోట్లతో గడ్డిపల్లిలో సమీకృత ప్రభుత్వ గురుకుల పాఠశాలను నిర్మి స్తున్నామని, తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 28 సమీకృత గురుకులాల నిర్మాణం చేపడుతున్నామని, మలిదశలో మరో 26 నిర్మించనున్నామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి బుధవారం కూడా కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి మైనా ర్టీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అక్కడే భోజనం చేసి, విద్యార్థినులతో ముచ్చటించను న్నారు.