Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: సరిహద్దుల్లో భారత వాయుసేన సేవలు అనిర్వచనీయం

–ప్రజాపాలన విజయోత్సవాలలో వాయుసేన ప్రదర్శన అద్భుతo
–భారతవాయుసేన, సూర్యకిరణ్ బృందం సేవలు వర్తమానానికి స్ఫూర్తి
–మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఏరోబాటిక్ టీం కెప్టెన్ సూర్యకి రణ్ బృందం కెప్టెన్ అజయ్ సారధి భేటి

ప్రజా దీవెన, హైదరాబాద్: అంకిత భావంతో దేశ సరిహద్దుల్లో భారత వాయుసేన అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.సవాళ్ళను,ప్రతి సవాళ్ళను ఎదుర్కోవడంలో వారు పోషిస్తున్న పాత్ర వర్త మానానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయ న్నారు. ప్రజాపాలన విజయోత్స వాలను పురస్కరించుకుని ఆది వారం ట్యాన్క్ బండ వద్ద భారత వాయుసేన,సూర్యకిరణ్ ఏరోబా టిక్ బృందం ప్రదర్శించిన వైమానిక విన్యాసాలు అద్భుత ఘట్టంగా ఆయన అభివర్ణించారు. భారత వాయుసేన,సూర్యకిరణ్ బృందం సేవలు వర్తమానానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయన్నారు. వారి దేశభక్తి,వారు చూపించే ధైర్యసాహసాలు, నిబద్ధత అజర మారం అన్నారు.

ఈ సందర్భంగా సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం కెప్టెన్ అజయ్ సారధి తన బృందం సభ్యులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ప్రత్యేకంగా భేటి అయ్యారు.భారత వాయుసేనలో యుద్ద విమాన పైలెట్ గా పనిచేసిన ఉద్వి గ్నక్షణాలను ఆయన ఈ సంద ర్భంగా గుర్తుచేసుకున్నారు
పాకిస్థాన్,చైనా సరిహద్దుల్లో మిగ్-21,మిగ్ 23 వంటి అడ్వాన్స్డ్ యుద్ద విమానాలను నడుపుతూ దేశభద్రతకు పని చేయడం గర్వ కారణంగా ఉందన్నారు. భారత వాయుసేన కు సూర్యకిరణ్ ఏరో బాటిక్ బృందం గర్వకారణంగా నిలుస్తోందన్నారు.ప్రపంచ వ్యాప్తం గా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ప్రదర్శనలు ఇవ్వడంలో ప్రసిద్ధి చెం దిందన్నారు.సూర్యకిరణ్ ఏరోబా టిక్ బృందాన్నీ వర్తమానం స్ఫూ ర్తిదాయకంగా తీసుకొని ప్రతి భా రతీయుడు ప్రేరణ పొందాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

యుద్ద విమా నాలు నడిపడంలో సిద్ధ హస్తుడిగా పేరొందిన మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ అందించిన సేవలు విశిష్ట మైనవని సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం కెప్టెన్ అజయ్ సారధి తెలిపారు. ధైర్యం, ఖచ్చితత్వం, నిష్ఠ తో కూడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత వాయుసేన దృఢ సంకల్పానికి ఈ ఐకాన్ గా నిలిచిపోతారని ఆయన కొని యాడారు. 2019 నుండి 2023 వరకు పార్లమెంట్ లో రక్షణ శాఖా కోసం వేసిన పార్లమీటరీ కమిటీ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రక్షణ శాఖా సిబ్బంది సంక్షేమంతో పాటు పదవీ విరమణ పొందిన వారి కోసం పాటు పడ్డారన్నారు.