–రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభా కాంక్షలు
— పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: భోగ బాగ్యాలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.
సంక్రాంతి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
కుల,మతాలకు అతీతంగా సమస్త రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి వెన్నెముకగా నిలిచిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో ముందెన్నడూ లేని రీతిలో ధాన్యం దిగుబడి సాధించడం సంవత్సర కాలంలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు.
ఇది రైతునామ సంవత్సరమని రాష్ట్ర ప్రభుత్వం రైతుపక్షపాతి అని చెప్పడానికి యావత్ భారత దేశంలోనే తెలంగాణా రైతాంగం కనీవినీ ఎరుగని రీతిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించడం అద్దం పడుతుందన్నారు.
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు గాను గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్ట్ ల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు గాను బృహత్ ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు.
అభివృద్ధికి విద్యనే తొలిమెట్టు అని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలలు నెలకొల్పుతున్నట్లు ఆయన వెల్లడించారు.
విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కామన్ డైట్ ప్రవేశ పెట్టడంతో పాటు ఏక కాలంలో 40%డైట్ చార్జీలు,200% కాస్మొటిక్ చార్జీలు పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు
అంతే గాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతిగృహాలలో ఉంటూ విద్య నభ్యసిస్తున్న విద్యార్థులకు ఇకపై సన్న బియ్యం అన్నం వడ్డించ బోతున్నట్లు ఆయన తెలిపారు.
అంతే గాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చెయ్యడంతో పాటు తెల్ల రేషన్ కార్డుదారులందరికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
పౌర సరఫరాల శాఖలో తెచ్చిన అనేక సంస్కరణలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయని,గడిచిన దశాబ్దాకాలంగా బ్రష్టు పట్టిపోయిన నీటిపారుదల రంగాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామన్నారు.
ఇదంతా రాష్ట్రసర్వోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అని ఇందులో రాష్ట్ర ప్రజలు భాగస్వామ్యం అయి ఇతోధికంగా తోడ్పాటునందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.