Vanamahotsava: ప్రజా దీవెన, కోదాడ:కే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ (Vanamahotsava) కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని స్థానిక కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపాల్ రేపాల శ్రీనివాస్ (Repala Srinivas) మొక్కలు నాటారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రేపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మొక్కలను నాటి, సామూహిక వనాలను పెంచడం వలన వర్షాలు ఎక్కువగా పడి, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవచ్చునని అన్నారు .
అలాగే ప్రతి ఒక్కరూ ఒక మొక్క (plant) నాటాలని, ముఖ్యంగా విద్యార్థులు ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓ మొక్క నాటే విధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి చెట్లు అని అందుకే ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో (Plantation program) కేవలం ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్స్ మాత్రమే కాకుండా… సామాజిక హితవును కోరుకునే ప్రతి ఒక్కరూ.
వివిధ గ్రామాలలోని యువతను, ప్రజలను మొక్కలు నాటే విధంగా చైతన్యవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం జి. శ్రీనివాస్, పి.జ్యోత్స్న,యస్. దేవమని, ఆర్.గురవయ్య, వి.వాసు, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, మారం రెడ్డి. ప్రభాకర్ రెడ్డి, వి.బలభీమ రావు, ఆర్.రమేష్ శర్మ, యం.రత్నకుమారి, బి.రమేష్ బాబు, రాజేష్, పి. తిరుమల,యస్.గోపికృష్ణ, యం.చంద్రశేఖర్, అధ్యాపకేతర సిబ్బంది బి. సుజాత, బి.వీరయ్య, వి.జ్యోతి, మమత, డి.ఎస్. రావు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థినీ విద్యార్థులు (students)పాల్గొన్నారు.