ప్రజా దీవెన, కోదాడ: అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు టి పి. సి. సి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్యలు అన్నారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుగుణంగా ప్రధాని ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది అన్నారు.
బలహీన వర్గాలకు, దళితులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు అని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపాటి. శ్రీను, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందులకోటేశ్వరరావు,కౌన్సిలర్లు గంధం. యాదగిరి, షాబుద్దీన్,కోటిరెడ్డి, సుశీల రాజు, పెండెం వెంకటేశ్వర్లు, కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్, మదర్,నిరంజన్ రెడ్డి, సుబ్బారావు, బాల్ రెడ్డి, ధన మూర్తి, పిడతల శ్రీను, గుండె పంగు రమేష్,పాలూరిసత్యనారాయణ,డేగ శ్రీధర్, బాగ్దాద్, దాదావలి,సైది బాబు, దావాల్ తదితరులు పాల్గొన్నారు.