Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vanguard Global : హైదరాబాద్‌లో వాన్‌గార్డ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్

Vanguard Global : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్ర పంచంలోని ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘వాన్‌గా ర్డ్’ (Vanguard Group) హై దరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయ నున్నట్లు ప్రకటించింది. వాన్‌గార్డ్ మన దేశంలో నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావటం విశేషం. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డితో వాన్‌గార్డ్ ప్రతినిధి బృం దం సోమవారం సమావేశమైంది.

ఈ సందర్భంగా జరిగిన చర్చల అ నంతరం హైదరాబాద్‌లో జీసీసీ ఏ ర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్ర కటించింది. Vanguard Group సీఈఓ సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఐఓ, ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ – వాన్‌గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం ఈ చర్చ ల్లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావే శం లో ఉన్నారు. ఈ ఏడాది చివరి నా టికి హైదరాబాద్‌ లో జీసీసీ కార్యా లయాన్ని అధికారికంగా ప్రారంభిం చనున్నట్లు వాన్‌గార్డ్ తెలిపింది. రా బోయే 4 సంవత్స రాల్లో 2,300 మంది ఉద్యోగులను నియమించు కోవాలని లక్ష్యంగా నిర్ణయించింది. వాన్‌గార్డ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల కు పైగా పెట్టుబడిదారులకు సేవలు అందిస్తోంది.

Hyderabad లో వాన్‌గార్డ్ ఏ ర్పా టు చేసే కేంద్రం ఇన్నోవేషన్​ హబ్‌గా పనిచేయనుంది. ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటి క్స్, మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రం గాల్లో అందుకు అవసరమైన ఇం జనీర్ల ను తక్షణమే నియమించు కోవా లని ప్రణాళికను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు కు వాన్‌గార్డ్ ముందుకు రావటం సం తోషకరమైన పరిణామంగా ము ఖ్యమంత్రి పేర్కొన్నారు. Telang anaRising విజన్‌లో భాగంగా హై దరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతున్నా మని అన్నారు.

వాన్‌గార్డ్ రాకతో ప్రపంచ స్థాయి లో హైదరాబాద్ మరింత బలప డుతుందని అన్నారు. మన దేశం లోని ప్రతిభను ఉప యోగించుకోవ డానికి, సాంకేతిక నిపుణులకు ఉ ద్యోగ అవకాశాలను మెరుగుపరు స్తుందని వివరించారు.

జీసీసీ నెలకొల్పడానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తుందని కంపెనీ ప్రతినిధుల కు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
వైవిధ్యమైన ప్రతిభతో పాటు, జీ వన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలకు హైదరాబాద్‌ అను కూలమైన వాతావరణం కలిగి ఉం దని కంపెనీ సీఈవో సలీం రాంజీ అభిప్రాయపడ్డారు. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహా య సహకారాలతో హైదరాబాద్‌ను తమకు అనువైన చోటుగా ఎంచు కున్నామని తెలిపారు.

తమ వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవలను అందించటంతో పాటు ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నా లజీలో ప్రతిభావంతులైన ఇంజనీ ర్లను అవకాశాలు కల్పించటం త మకు సంతోషంగా ఉందన్నారు.