Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Varshit Reddy: ముచ్చటగా మూడు రోజుల గడువు

–నల్లగొండ బైపాస్ ఆప్షన్ మార్చు కోవాల్సిందే
–మూడవ ఆప్షన్ మీకు లాభమని సామాన్యుల పొట్టకొడుతున్నారు
–మంత్రి కోమటిరెడ్డి కి బిజెపి జిల్లా అద్యక్షుడు వర్షిత్ రెడ్డి అల్టిమేటం

Varshit Reddy: ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ (nalgonda) జిల్లా కేంద్రంలో బైపాస్ రింగ్ రోడ్డు నిర్మాణం భూసేకరణ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నా గం వర్షిత్ రెడ్డి (Varshit Reddy డిమాండ్ (demand) చేశారు. బైపాస్ రింగ్ రోడ్డు (Bypass Ring Road) కు అవసరమైన భూ యజమానుల అభిప్రాయాలు పరిగణ లో కి తీసుకోకుండా ఏక పక్షంగా రోడ్డు నిర్మాణం భూసేకరణ విషయంలో నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. బైపాస్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఇచ్చిన మూడు ఆప్షన్ల లో అందరికీ అన్యాయం చేసే ఆప్షన్ నేర్చుకోవడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. తన ని కలిసిన బైపాస్ భూ నిర్వాసితుల గోడును ఆలకించిన ఆయన అనం తరం మీడియాతో మాట్లాడారు. నల్లగొండ ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేసి నాగార్జున సాగర్ లో నీటి సంపులో 40 కోతులు పడిచని పోయిన ఘటన మరువకముందే నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి నీటి సంపులో పడి వారం రోజుల అయిన గుర్తించకుండా నల్లగొండ ప్రజలు ఆ నీటిని తాగిపించిన ఘన త మంత్రిదని, అలాగే ఇంత వరకు మున్సిపల్ అధికారులు మీద ఎ లాంటి చర్యలు తీసుకోకపోవడమే అందుకు నిరసనమని ఆరోపించారు.

ప్రజల ఆరోగ్యం పట్టనట్లు వ్యవ హరిస్తున్నారు.దీనికి పూర్తి బాధ్యత నల్లగొండ మున్సిపల్ కమిషనర్ (Nalgonda Municipal Commissioner పూ ర్తి బాధ్యత వహించాలి అన్నారు. అంతకుముందే ఔటర్ రింగ్ రోడ్డు లో భూమి కోల్పోతున్న బిజెపి జిల్లా (bjp) కార్యాలయంకు విచ్చేసి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్శిత్ రెడ్డి (Nagam Varshit Reddy ని కలిసి న్యాయం చేకూర్చాలని కలి సిన భూ నిర్వాసితులు రోడ్డు మ్యాప్ ను చూస్తూ వారిని ఉద్దే శించి మీడియా మిత్రులతో మాట్లా డుతూ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి జాతీయ రహదారి 656 ఔటర్ రింగ్ రోడ్డు ను వారి తోత్తుల కోసం ఆప్షన్ 1 అలాగే ఆప్షన్ 2 ను కాదని ఆప్షన్ 3ను తీసుకోవడం వె నుక పెద్ద తతంగమే ఉందన్నారు. ఇల్లు కోల్పోయినవారికి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) ఇస్తా అంటున్నవాని నీకు నల్లగొండలో ఇల్లు లేదు అని హైద రాబాద్ లో బెంగుళూరులో బంగ్లా లో ఉంటున్నావు అని ప్రజలకు అం దరికి నీ బాగోతం తెలిసింది అన్నా రు. ప్రజలు నీపై యుద్ధం చేయడా నికి సిద్ధంగా ఉన్నారు అని నీవు ఆప్షన్ మూడుని వెనక్కి తీసుకో కుంటే నిరాహార దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం,నీ ఇంటిని ముట్టడి చేస్తాం అన్నారు. మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని నీ లబ్ది కోసం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసు కోవాలని మూడు రోజులు గడువు ఇస్తున్నాని కోడిగుడ్డును చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.