— రూ. 1కోటితో నూతన విద్యుత్ 5 ఎంవిఏ ప్రారంభం
–షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Veerlapalli Shankar: ప్రజా దీవెన షాద్ నగర్: గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరిట చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని అది ఎన్నో సందర్భాల్లో తను ప్రతిప క్ష నేతగా ఉన్నప్పుడు రికార్డుల పరంగా రుజువు చేసినట్టు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar) అన్నారు. నియోజకవర్గంలోని కొందూ రు మండలం ఆగిరాల గ్రామంలో కోటి రూపాయల నిధుల తో ఏర్పాట్లు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ 5ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ (MVA transformer)ప్రారంభోత్సవంతో పాటు 25 లక్షల రూపాయల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకు స్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar)ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ వద్ద జ్ఞాపికగా అధికారు లతో కలిసి ఒక మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రారంభో త్సవ సభలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar)మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు పేరిట 24 గంటల కరెంటు ఎప్పుడు సరఫరా చేయలేదని 12 లేక 13 గంటల వరకు కరెంటు సరఫరా చేయడం జరిగిందని పేర్కొన్నారు. తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయా మండలాల్లో విద్యుత్ లాక్ బుక్ పరిశీలించడం జరిగిందని మొత్తం తనకి చేస్తే 12 లేక 13 గంటల మేరకు ఉచిత విద్యుత్ అందజేసినట్లు తన పరిశీలనలో వెళ్లడైందని ప్రస్తుత విద్యుత్ శాఖ అధికారులకు ఆ విషయం తెలుసని శంకర్ అన్నారు. ఉచిత విద్యుత్ సరఫరా పేరిట గత బి ఆర్ ఎస్ (brs)ప్రభుత్వం కోట్ల రూపాయల కుంభకోణం చేసిందని విమర్శించారు. తక్కువ ఖర్చుకు కరెంటునుకొని ఎక్కువ ఖర్చు చూపించిందని గత ప్రభుత్వ అవినీతి చర్యలను ఎండగట్టారు. కరెంటు కొనుగోలుకు పెద్ద ఎత్తున అప్పులు చేసి ప్రజల నెత్తిన పెనుబారాలు మోపారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు విద్యుత్ వ్యవహారంపై స్పష్టత వచ్చిందని అన్నారు. దాదాపు గత ప్రభుత్వం సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రజలను రాష్ట్రాన్ని నిండా అప్పులతో ముంచిందని విమర్శలు వ్యక్తం చేశారు.
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందజేయాలంటే
విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. కాలం చెల్లిన కరెంటు వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, ఇతర పరికరాలు ఉన్నాయని వాటిని అధిగమించి నాణ్యమైన విద్యుత్ (electricity)కోసం ఎప్పటికప్పుడు నూతన ప్రణాళిక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వివరించారు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ ఈ ప్రాంతంలో విద్యుత్ అవసరాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఈ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన దాత కూడా ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి చోరవతో ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చిట్టెం దామోదర్ రెడ్డి, మునగపాటి అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాజు, పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.