–మున్సిపల్ అధికారులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశం
Veerlapalli Shankar:ప్రజా దీవెన, షాద్ నగర్: షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలపై (Many problems)అధికా రులు స్థానిక ప్రజాప్రతితులు సిబ్బం ది వెంటనే దృష్టి సారించాలని స్థాని క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar)ఆదే శించారు. శుక్రవారం స్థానిక మున్సి పల్ కమిషనర్ చీమ వెంకన్న పర్య వేక్షణలో మున్సిపల్ చైర్మన్ కే. నరేం దర్ సభ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశo( Municipal General Assembly) జరిగిం ది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తదితర కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దే శించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూపారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని, పట్టణంలోని అన్ని వార్డులలో ప్రతిరోజు పారిశుద్ధ కార్యక్రమాలు జరిగేటట్టుగా చూడా లని సభ్యులు కోరడం జరిగిందని తెలిపారు.
పురపాలక సంఘంలో (Municipal Corporation) చాలా ప్రదేశాలలో విద్యుత్ దీపాల సమస్యలు ఉన్నాయని, పాడైపోయిన లైటులను వెంటనే మరమ్మతు చేయించాలని కోరడం జరిగిందన్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు (CC cameras) ఏర్పాటు చేయడం కోసమై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేసి అన్ని వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరడం జరిగింది. మిషన్ భగీరథ నేటి విషయంలో చాలా చోట్లలో సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సభ్యులు కోరడం జరిగింది. పురపాలక సంఘంలోని చాలా ప్రాంతాలలో హైమాస్ లైట్లు వెలగడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పారిశుద్ధ కార్మికుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని వారికి ఆరోగ్య భీమా (Health insurance) కల్పించాలని, పట్టణంలోని అన్ని వార్డులలో కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని సభలోని అందరి సభ్యులు అభిప్రాయపడ్డారు. వీటి నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలని, పురపాలక సంఘంలో విలీనమైన పరిసర గ్రామాలపై ప్రత్యేక దృష్టిని సహకరించి వాటి అభివృద్ధిపై ప్రత్యేక నిధులను కేటాయించాలని సభ్యులు సమదృష్టికి తెచ్చినట్టు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక నిధులను కేటాయించే ప్రభుత్వంతో చర్చించి పట్టణాన్ని అభివృద్ధి పరచాలని సభ్యులందరూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.