–నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం
Vemula Viresham:ప్రజా దీవెన, నకిరేకల్: అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి (Congress party)పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయ ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham)అన్నారు. సోమవారం నకిరే కల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయం నందు నకిరే కల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృషమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ చౌవుగోని రాములమ్మ సైదులు ఆయా వార్డు లకు చెందిన బిఆర్ఎస్ నాయకులకు (BRS leaders) కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి సాధారoగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ వీరేశం నకిరేకల్ మున్సిపాలిటీని సుంద రీకరణ చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. ప్రతి వార్డు ల్లో నెలకొన్న సమస్యలను పరిష్క రించి, అభివృద్ధికి తోడ్పాటు ఉంటా మని స్పష్టం చేశారు. పాత, కొత్త తే డా లేకుండా ప్రతి ఒక్కరికి సము చిత స్థానం కల్పిస్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మెనీఫెస్టో కమిటీ (TPCC Manifesto Committee) మెంబర్ చామల శ్రీనివాస్, పి ఎ సి ఎస్ చైర్మన్ నాగు లవంచ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసు పాదం, మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, మాజీ యం.పి.పి లిం గాల వెంకన్న,స్థానిక కౌన్సిలర్లు, కాం గ్రెస్ పార్టీ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.