Ven Reedy Raju : ప్రజా దీవన, నారాయణపురం : పదవి విరమణ పొందిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు స్థానిక కౌన్సిలర్ బాబా షరీఫ్ లను చౌటుప్పల్ మండల రాయల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ.బంగారిగడ్డ అభివృద్ధి కోసం వారు చేసిన సేవలను కొనియాడారనీ.
రాయల్ యూత్ అసోసియేషన్ భవన నిర్మాణం కొరకై అడిగిన వెంటనే 40 లక్షల సాంక్షన్ చేసి భవనాన్ని నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయల్ యూత్ కమిటీ అధ్యక్షుడు యూన్నుస్,షాదిఖానా చైర్మన్ కరీం,చోటే బాయ్,ఏజాస్, ఇబ్రహీం,దస్తగిరి,సమీర్ ఇమ్రాన్,ఫదీర్,మైనార్టీ నాయకులు మహ్మద్ జమీల్,గౌరవ అధ్యక్షులు అబ్దుల్లా,జమీర్,జానీ,లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.