Venkat : ప్రజాదీవెన, నల్గొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన విద్యాంజలి 2.0 సంక్షేమ కార్యక్రమం పై గిరిజన హాస్టల్ వార్డెన్లతో అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, గిరిజన సంక్షేమ హాస్టళ్ల లో అనంత ఈ సొల్యూషన్ సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ విద్యాంజలి కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు.
విద్యాంజలి మేనేజర్ వెంకట్ మాట్లాడుతూ సబ్జెక్టు టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్, యోగ ట్రైనర్, కంప్యూటర్ ట్రైనర్, కరాటే ట్రైనర్, అటెండర్, స్వీపర్లు, రాత్రి పగలు వాచ్ మెన్లు ఉంటారని ఇది “అనంత ఈ సొల్యూషన్” వారి సౌజన్యం తో విద్యాంజలి 2.0 అనే బృహత్తర కార్యక్రమం గిరిజన విద్యార్థుల ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివి నాయక్, సీఈవో శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ మధు కిరణ్, ఏవో పార్థసారథి, గిరిజన సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.