*పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలి. వెంకటేశ్వర్లు.
Venkateshwar: ప్రజా దీవెన, కోదాడ: చిలుకూరు మండలం నూతన ఎంఈఓ గా నియామకమైన మాగి గురవయ్యను కోదాడ పట్టణంలోని అయన నివాసంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు (Venkateshwar)మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాగి గురవయ్య ఉపాధ్యాయ వృత్తి పట్ల ఎంతో అంకితభావంతో పనిచేస్తూ ఇటీవల బేతావోలు జిల్లా పరిషత్ హై స్కూల్ (Zilla Parishad High School) లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడుగా చిలుకూరు మండల నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రభుత్వం నిన్న చిలుకూరు మండల విద్యాధికారిగా నియమించటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మండల విద్యాధికారిగా పేద, బడుగు బలహీనవర్గాల (Badugu weaker sections) పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు బోల్లి కొండ కోటయ్య, బొడ్డు హుస్సేన్,చేకూరి రమేష్, దున్న వెంకటేశ్వర్లు, పిడమర్తి అంకులయ్యా, పులి నరసింహారావు, గుండె పంగు రమేష్,అమరబోయిన.వెంకటరత్నం, వెంకటరమణ, సుభద్ర, ఆనంద్, రంగారావు, బాబు తదితరులు పాల్గొన్నారు.